Hydra: మారిన హైడ్రా లోగో

by Prasad Jukanti |

హైడ్రా లోగో మారింది.

Hydra: మారిన హైడ్రా లోగో
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) లోగో (Hydra New Logo) మారింది. గ్రాన్డియర్ లుక్ లో పాత లోగో ఉండగా వాటర్ వర్క్స్ విభాగాన్ని తలపించేలా కొత్త లోగో రూపొందించారు. ప్రస్తుతం ఈ కొత్త లోగోనే హైడ్రా (Hydra) తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) అకౌంట్ హ్యాండిల్ కు డీపీగా ఉపయోగించింది. కాగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని ప్రజలను విపత్తుల నుంచి రక్షించందుకు, ప్రభుత్వ ఆస్తుల రక్షణ, నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్వతంత్ర సంస్థగా హైడ్రా వ్యవస్థను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. హైడ్రా ఏర్పాటు అయ్యాక నగరంలో ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాల కూల్చివేత్తలతో నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఆక్రమణలకు గురైన చెరువుల పరిరక్షణ విషయంలో చురుకుగా వ్యవహరిస్తోంది.

Next Story