- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
HYDRA: చెరువుల వద్ద ‘హైడ్రా’ గస్తీ.. రౌండ్ ది క్లాక్ షిష్ట్‌లకు ప్లాన్
చెరువులను కబ్జా చేయకుండ, చెత్త వేయకుండా కాపాటడానికి హైడ్రా చర్యలు చేపట్టింది.

దిశ, తెలంగాణ బ్యూరో: చెరువులను కబ్జా చేయకుండ, చెత్త వేయకుండా కాపాటడానికి హైడ్రా చర్యలు చేపట్టింది. కబ్జాదారుల చేతుల్లో చిక్కుకున్న 70 చెరువులను గుర్తించిన హైడ్రా వాటి వద్ద 24/7 గంటల పాటు గస్తీ పెట్టాలని నిర్ణయించింది. ముఖ్యంగా నగర శివారులోని చెరువులను ఎంచుకుంది. గతంలో రాత్రికి రాత్రే చెరువుల్లో మట్టి నింపి పలు ప్రైవేటు కంపెనీలు కబ్జా చేసిన విషయం తెలిసిందే. టిప్పర్లు, ట్రాక్టర్లను గుర్తించి మట్టి పోసిన వారిపై కేసులు కూడా నమోదు చేశారు. ఈ నేపథ్యంలో గస్తీ పెట్టాలని నిర్ణయించారు. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో 549 చెరువులకు సర్వే నిర్వహించడంతో పాటు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను గుర్తించి 411 చెరువులకు ప్రిలిమినరీ నోటిపికేషన్ ఇచ్చారు. 138 చెరువులకు ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చారు. త్వరలోనే అన్ని చెరువులకు ఫైనల్ నోటిఫికేషన్ ఇవ్వడానికి చర్యలు తీసుకోనున్నారు. అయితే మొదటి దశలో 70 చెరువుల వద్ద మాత్రమే గస్తీ ఏర్పాటు చేశారు. రెండో దశలో ఓఆర్ఆర్ పరిధిలోని అన్ని చెరువుల వద్ద గస్తీ ఏర్పాటు చేయనున్నారు.
24/7 గంటల పాటు..
ఓఆర్ఆర్ పరిధిలోని 70 చెరువుల వద్ద 24/7 గంటల పాటు చెరువుల వద్ద మూడు షిప్ట్‌లుగా గస్తీ ఏర్పాటు చేశారు. షిఫ్ట్‌కు ఇద్దరు చొప్పున భద్రత కల్పించారు. ఈ గస్తీ చేస్తున్న వారిని హైడ్రా అవుట్ సోర్సింగ్ విధానంలో పోలీసు కానిస్టేబుల్ పరీక్షలో తక్కువ మార్కులతో ఉద్యోగం కోల్పోయిన వారిని గుర్తించి 400 మందిని నియమించుకుంది. వీరందరికి మూడు రోజుల పాటు శిక్షణ కూడా ఇచ్చింది. వీరందరిని చెరువులను పరిరక్షించేందుకుగాను ఒక్కో చెరువుకు ఏడుగురి చొప్పున కేటాయించారు. దీంతో చెరువులను కబ్జాల బారీ నుంచి గార్డులు రక్షిస్తున్నారు. చెరువుల పరిరక్షణలో భాగంగానే చెరువుల వద్ద గస్తీ ఏర్పాటు చేశామని లేక్ ప్రొటెక్షన్ కమిటీ చైర్మన్, హైడ్రా కమిషనర్ ఏవీ.రంగనాథ్ తెలిపారు. త్వరలోనే కబ్జాలు చేసే అవకాశం ఉన్న చెరువులను గుర్తించి వాటికి సైతం గస్తీ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.






