- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాజేంద్రనగర్‌లో అక్రమ కట్టడాలపై హైడ్రా పంజా.. రూ. 139 కోట్ల భూమికి విముక్తి
ప్రభుత్వ స్థలాల్లో అక్రమ కట్టడాలపై హైడ్ర పంజా విసురుతూనే ఉంది. ఇప్పటికే నగరంలో వందల ఎకరాల్లో భూములను కాపాడిన హైడ్రా.. తాజాగా మరో రూ. 139 కోట్లు భూమికి విముక్తి కలిగించింది.

దిశ, వెబ్ డెస్క్: ప్రభుత్వ స్థలాల్లో అక్రమ కట్టడాలపై హైడ్ర (Hydra) పంజా విసురుతూనే ఉంది. ఇప్పటికే నగరంలో వందల ఎకరాల్లో భూములను కాపాడిన హైడ్రా.. తాజాగా మరో రూ. 139 కోట్లు భూమికి విముక్తి కలిగించింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలంలో కబ్జాలను హైడ్రా (Hydra) బుధవారం తొలగించింది. అలాగే బద్వేల్ - ఉప్పరపల్లి గ్రామాల్లో జనచైతన్య లేఔట్ ఫేజ్ 1, 2 లలో ఆక్రమణలకు గురైన 4 పార్కులకు హైడ్రా విముక్తి కల్పించింది.19878 గజాల భూమిని ఆక్రమణదారుల నుంచి స్వాధీనం చేసుకున్నట్లు హైడ్రా ప్రకటించింది. దీని విలువ రూ. 139 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
దాదాపు 120 ఎకరాల్లో ఫేజ్ I &II పేరుతో హుడా అప్రూవల్‌తో ఏర్పాటు చేసిన జనచైతన్య లేఔట్‌లో పార్కులు కబ్జాకు గురి అవుతున్నాయని హైడ్రా ప్రజావాణికి ఫిర్యాదులు అందాయి. రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం కబ్జాలు జరిగినట్టు హైడ్రా నిర్ధారించింది. ఈ మేరకు బుధవారం ఉదయం అధికారులతో కలిసి హైడ్రా సిబ్బంది అక్రమ కట్టడాలను (Illegal constructions) తొలగించారు. ప్రహరీలు నిర్మించుకొని వేసిన షెడ్డులను , రూమ్‌లను హైడ్రా తొలగించింది. 3 వేలు, వెయ్యి గజాలు, అయిదు వందల గజాల చొప్పున ఆక్రమించి నిర్మించిన షెడ్డులను హైడ్రా నేలమట్టం చేసింది. ఆక్రమణల తొలగింపు తర్వాత వెను వెంటనే ఫెన్సింగ్ నిర్మాణ పనులు చేపట్టినట్లు హైడ్రా అధికారులు ప్రకటించారు.






