- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బతుకమ్మకుంట బాగుందా..! వాకర్లతో హైడ్రా కమిషనర్ ముచ్చట.. కలిసి పని చేద్దామని పిలుపు
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ శనివారం బతుకమ్మకుంటను సందర్శించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ శనివారం బతుకమ్మకుంటను సందర్శించారు. సాయంత్రం 6 గంటల సమయంలో బతుకమ్మ కుంట చుట్టూ వాకర్లతో కలిసి నడిచారు. బతుకమ్మ కుంట అభివృద్ధి పట్ల వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఎంత మంది వాకింగ్‌కు వస్తున్నారు. బతుకమ్మకుంట బాగుందా.. ఎలా ఉపయోగపడుతోంది.. ఈ పరిసర ప్రాంత ప్రజలకు కలుగుతున్న ప్రయోజనాలను అడిగి తెలుసుకున్నారు. బతుకమ్మ కుంట ఇప్పుడు మాకందరికీ విహార కేంద్రం అయ్యిందని స్థానికులు కమిషనర్‌కు చెప్పారు. బతుకమ్మ కుంట అందుబాటులో రావడంతో ఈ పరిసర ప్రాంతాల రూపురేఖలే మారిపోయాయని, వాకింగ్ చేసుకుంటూ ఆరోగ్యాలు కాపాడుకుంటున్నామని అన్నారు. ఒకప్పుడు దుర్గంధంతో వ్యాధులు భారిన పడేవాళ్ళమని యిప్పుడు ఆరోగ్యాలు కాపాడుకు తున్నామన్నారు.
పిల్లలకు మంచి క్రీడా స్థలంగా మారిందని చెప్పారు. ఈ చెరువును సెప్టెంబర్ 28న ప్రారంభించామని, చెరువు చుట్టూ వేసిన మొక్కలు పెద్దవైతే మరింత ఆరోగ్యవంతంగా పరిసరాలు మారుతాయని కమిషనర్ చెప్పారు. చెరువును అంతే శుభ్రంగా కాపాడుకోడానికి హైడ్రాతో కలిసి పని చేయాలని అక్కడి వాకర్లతో కమిషనర్ ముచ్చటించారు. ఈ సందర్భంగా కమిషనర్‌తో ఫోటోలు దిగి చాలా మంది పదిలపరచుకున్నారు. చిన్నారులు థాంక్ యూ సార్ అంటూ కమిషనర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.






