ఆ భూముల్లో ఉంటున్నవారు పేదలు కాదు : హైడ్రా రంగనాథ్

by Naga Rani Yarlagadda |

ఆదివారం ఉదయం హైదరాబాద్ పరిధిలో గల గాజులరామారంలో హైడ్రా కొరడా ఝుళిపించింది.

ఆ భూముల్లో ఉంటున్నవారు పేదలు కాదు : హైడ్రా రంగనాథ్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆదివారం ఉదయం హైదరాబాద్ పరిధిలో గల గాజులరామారంలో హైడ్రా కొరడా ఝుళిపించింది. 275 ఎకరాల్లో ఉన్న అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసింది. దీంతో అక్కడి నివాసితులు ఆందోళనకు దిగారు. పండుగపూట తమను రోడ్డుకు ఈడుస్తున్నారని వాపోతూ నిరసన వ్యక్తం చేశారు. ఈ కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. గాజులరామారంలో 40 ఎకరాల్లో పేదలు నివాసాలు ఏర్పరచుకున్నారని తెలిపారు. అయితే ఆ భూముల్ని రాజకీయ నేతలు అధికారులతో కుమ్మక్కై.. కబ్జా చేసి పేదలకు విక్రయించారన్నారు.

ఈ భూముల ఆక్రమణలను తీసివేయాలని 6 నెలల్లో ఐదుసార్లు హైడ్రా అధికారులు స్థానికులతో మాట్లాడారని తెలిపారు. ప్రస్తుతం అక్కడ నివాసాలను తొలగించడం లేదని, వ్యాపార షెడ్లు, కాంపౌండ్ వాల్స్, గదులు నిర్మించి ఉన్న వాటిని కూల్చివేస్తున్నట్లు చెప్పారు. రూ.13 వేలకోట్ల విలువైన 275 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని స్వాధీనంచేసుకుంటామన్నారు.

Next Story