- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రజలలో హైడ్రాపై పూర్తి అవగాహన కల్పించాం: రంగనాథ్
ఈ ఏడాదిలో విజయాలతో పాటు పలు సవాళ్లను కూడా ఎదుర్కొన్నామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. ప్రజల్లో హైడ్రాపై పూర్తి అవగాహన కల్పించామని చెప్పారు.

దిశ, వెబ్ డెస్క్: ఈ ఏడాదిలో విజయాలతో పాటు పలు సవాళ్లను కూడా ఎదుర్కొన్నామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. ప్రజల్లో హైడ్రాపై పూర్తి అవగాహన కల్పించామని చెప్పారు. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ అంటే ప్రజలకు హైడ్రా వల్ల అవగాహన వచ్చిందన్నారు. అంతే కాకుండా చెరువులు నాలాల వద్ద ఆక్రమణలు కూడా తగ్గాయని అన్నారు. ఏడాది కాలంలో దాదాపు 500 ఎకరాల వరకు కాపాడగలిగామన్నారు. వాటి విలువ దాదాపు రూ.30వేల కోట్ల వరకు ఉంటుందన్నారు. ఆక్రమణలు అంటే ఏంటో ప్రజలకు ఒక అవగాహన వచ్చిందని, దాని వల్ల కబ్జాలు తగ్గాయన్నారు.
దాదాపు 20 చెరువుల్లోని ఆక్రమణలను తొలగించామని చెప్పారు. నిన్న పెద్ద వర్షం పడినా బతుకమ్మకుంట చెరువులోకి చేరడం ద్వారా వరద తగ్గిందన్నారు. దాని వల్ల గ్రౌండ్ వాటర్ కూడా పెరుగుతుందని చెప్పారు. మరికొన్ని చెరువుల్లో కూడా ఆక్రమణలు తొలగిస్తామని తెలిపారు. హైడ్రా వచ్చిన తరవాత నిర్మించిన అక్రమ నిర్మాణాలను తొలగిస్తామని తెలిపారు. ఆక్రమణల విషయంలో హైడ్రా చాలా సీరియస్ గా ఉందని చెప్పారు. మూసీతో హైడ్రాకు సంబంధం లేకపోయినా తమకు ఆపాదించారన్నారు. హైడ్రా పెద్దలపైకే వెళుతుందని పేదల జోలికి వెళ్లదని అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. హైడ్రాను బూచీగా చూపే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు.






