- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫిర్యాదులపై క్షేత్రస్థాయి పరిశీలన.. హైడ్రా కమిషనర్ కీలక ఆదేశాలు
హైడ్రా కార్యాలయం (Hydra Office)లో ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ (Hydra Commissioner AV Ranganath) క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.

దిశ, వెబ్ డెస్క్: హైడ్రా కార్యాలయం (Hydra Office)లో ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ (Hydra Commissioner AV Ranganath) క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ముందుగా అల్వాల్ మండలం (Alwal Mandal) తిరుమలగిరి (Thirumalagiri) విలేజ్ లోతుకుంటలో ప్రభుత్వ భూమి కబ్జాకు గురైందని వచ్చిన ఫిర్యాదును పరిశీలనలోకి తీసుకొని, ఆ ప్రాంతానికి వెళ్లారు. కంటోన్మెంట్ ప్రాంతంలో ఆ భూమి జనరల్ ల్యాండ్ రికార్డ్స్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానిదిగా నమోదవ్వగా.. ప్రైవేటు వ్యక్తులు తమదని పేర్కొంటున్నారు. ఈ భూమి రికార్డులను పరిశీలించిన రంగనాథ్.. వందకు పైగా ఎకరాలున్న ఈ భూమిలో ఎలాంటి కట్టడాలకు అనుమతులు ఇవ్వరాదని అధికారులకు సూచించారు.
అనంతరం గండిమైసమ్మ మండలం (Gandi Maisamma Mandal) దుండిగల్ (Dundigal) విలేజ్ లోని బుబ్బఖాన్ చెరువు దిగువున వున్న లింగం చెరువు కాలువ పరిసరాలను పరిశీలించారు. బుబ్బఖాన్ చెరువు అలుగు, తూముల నుంచి వరద నీరు వెళ్లకుండా నాలను కబ్జాచేసి నిర్మాణాలు జరిగాయని.. దీంతో వరద ముంచెత్తుతోంది స్థానికులు ఫిర్యాదు చేసారు. ఈ నాలా సమస్యను పరిష్కరించాలని కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ ప్రాంత వాసులు అంత కలసి కట్టుగా నిర్ణయానికి రావాలని.. అక్కడ నివాసితులకు, రియల్ ఎస్టేట్ సంస్థలకు కమిషనర్ సూచించారు. ఇక చివరగా హఫీజ్‌పేట (Hafeejpet) దగ్గర ప్రభుత్వ భూమి కబ్జాకు గురైందన్న ఫిర్యాదు మేరకు ఆ ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. టీడీఆర్ కింద లబ్ధిపొంది.. ప్రభుత్వ భూమిని కబ్జా చేశారా? అనేది పరిశీలించి, వాస్తవాలను తేల్చాలని అధికారులను ఏవీ రంగనాథ్ ఆదేశాలు ఇచ్చారు.






