- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైడ్రా పేదల మీదకు వెళ్తుంది, పెద్దోళ్లను వదిలేస్తుందనడం అవాస్తవం : రంగనాథ్
బతుకమ్మ కుంట చెరువు పునరుద్ధరణపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు.

దిశ, వెబ్‌డెస్క్: బతుకమ్మ కుంట చెరువు పునరుద్ధరణ విషయంలో హైడ్రా (HYDRA) కమిషనర్ రంగనాథ్ స్పందించారు. బతుకమ్మ కుంటలో అసలు చెరువు లేదంటూ ఎడ్ల సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే.. సర్వే ఆఫ్ ఇండియా రికార్డుల ప్రకారం అక్కడ 10 ఎకరాల చెరువు ఉన్నట్లు స్పష్టంగా ఉందని కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. వరదల నివారణకు సంబంధించి అవసరమైన చర్యలు తీసుకునేందుకు హైకోర్టు తమకు అనుమతి ఇచ్చిందని ఆయన తెలిపారు. హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను పాటిస్తూనే తాము ముందుకు వెళ్తున్నామని స్పష్టం చేశారు. హైడ్రా కేవలం పేదల ఇళ్లను మాత్రమే తొలగిస్తుందని, పెద్దవారిని వదిలేస్తుందని వస్తున్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. ఈ ప్రచారంలో వాస్తవం లేదని, చట్టప్రకారమే చర్యలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. హైడ్రా పేదల మీదకు వెళ్తుంది.. పెద్దోళ్లను వదిలేస్తుందన్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమన్నారు. ఇలాంటి పుకార్లను ప్రజలు నమ్మొద్దని కోరారు.
గతంలో హైడ్రా అనేక ప్రాంతాల్లో చెరువులను ఆక్రమించి నిర్మించిన ఇళ్లు, అపార్టుమెంట్లను కూల్చివేసిన విషయం తెలిసిందే. ఫలితంగా అనేక కుటుంబాలు నిలువనీడ లేకుండా రోడ్డున పడ్డాయి. ఈ క్రమంలో బడా బడా నేతలు, సెలబ్రిటీల జోలికి హైడ్రా వెళ్లబోదని, పేదలపైనే ఉక్కుపాదం మోపుతోందన్న ప్రచారం జోరుగా జరిగింది. ఈ క్రమంలోనే హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు.






