- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
AV Ranganath: ఆలయ భూముల కబ్జా.. అధికారుల నిర్లక్ష్యంపై ప్రభుత్వానికి నివేదిస్తాం: హైడ్రా కమిషనర్
స్థానిక అధికారుల నిర్లక్ష్యంపై ప్రభుత్వానికి నివేదిస్తామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ వెల్లడించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: స్థానిక అధికారుల నిర్లక్ష్యంపై ప్రభుత్వానికి నివేదిస్తామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ (AV Ranganath) వెల్లడించారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం (Jagadgirigutta temple lands) జగద్గిరిగుట్టపై ఉన్న ఆలయ భూముల ఆక్రమణలపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో హైడ్రా కమిషనర్ శనివారం క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. అలాగే అక్కడ వున్న పర్కి చెరువు కబ్జాలకు కూడా స్థానికులు కమిషనర్‌కు చూపించారు. జగద్గిరి గుట్ట ఆలయ సముదాయాలను, ఆలయ భూములను కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా వేంకటేశ్వర ఆలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు చేసి ఏవీ రంగనాథ్‌కి ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ.. గోవిందరాజుల స్వామి ఆలయం కొలను, గుండం కబ్జా అవుతున్నట్టు పూజారి నరహరి వీడియోను కూడా చూసి ఇక్కడకు వచ్చినట్లు తెలిపారు. 2024 జూలైలో హైడ్రా (Hydra) ఏర్పాటు అయిందని, అంతకు ముందు నిర్మించిన నివాసాల జోలికి హైడ్రా వెళ్ళదని కమిషనర్ స్పష్టం చేశారు.
కుల సంఘాల పేరిట ఆలయాల భూముల కబ్జాలకు చేసి స్వంతానికి వాడుకోవడాన్ని కమిషనర్ తీవ్రంగా పరిగణించారు. కులసంఘాల పేరిట కబ్జా చేసి ప్లాట్లు చేసి అమ్ముకోవడాన్ని కూడా సీరియస్‌గా తీసుకున్నారు. గూగుల్ మ్యాప్స్ పరిశీలించి 2024 జూలై తర్వాత వచ్చే కబ్జాలను గుర్తిస్తామని అన్నారు. కబ్జాదారులకు నోటీసులు ఇస్తామని చెప్పారు. హైడ్రా పోలీస్ స్టేషన్ కూడా 15 రోజుల్లో పని ప్రారంభిస్తుందని, కబ్జాదారుల నాన్ బెయిలబుల్ కేసులు పెడతామని హెచ్చరించారు. వచ్చే బుధవారం జగద్గిరి గుట్ట ఆలయ భూములతో పాటు పర్కి చెరువు కబ్జాలపై స్థానికులతో హైడ్రా కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అన్ని ఆధారాలతో హైడ్రా కార్యాలయానికి వచ్చి పత్రాలు అందజేయాలని వారికి సూచించారు.
పర్కి చెరువు పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేసి.. చెరువు కబ్జా కాకుండా కాపాడాలని, అధికారులకు సహకరించాలని సూచించారు. స్థానికులు ఒక కమిటీగా ఏర్పడి దేవాలయ భూముల పరిరక్షణకు నడుం బిగించాలని కోరారు. ఈ రెండు కమిటీల వాట్సాప్ గ్రూప్‌లలో తనను యాడ్ చేసి సమాచారాన్ని షేర్ చేయాలని సూచించారు. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఇంత సమయాన్ని వెచ్చించి కబ్జాలకు పరిశీలించడంపై స్థానికులు సంతృప్తి వ్యక్తం చేశారు. హైడ్రా కమిషనర్‌కి అభినందనలు తెలిపారు.






