- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గ్లోబల్ సమ్మిట్‌లో హైడ్రా, డీఆర్ఎఫ్ సేవలపై ఆరా
గ్లోబల్ సమ్మిట్‌లో వివిధ ప్రభుత్వ విభాగాలతో కలిసి ఏర్పాటు చేసిన హైడ్రా స్టాల్ అందరినీ ఆకట్టుకుంటోంది. హైడ్రా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్సు

దిశ, తెలంగాణ బ్యూరో: గ్లోబల్ సమ్మిట్‌లో వివిధ ప్రభుత్వ విభాగాలతో కలిసి ఏర్పాటు చేసిన హైడ్రా స్టాల్ అందరినీ ఆకట్టుకుంటోంది. హైడ్రా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్సు సేవలు అందరి మన్ననలూ పొందుతున్నాయి. రాత్రి, పగలూ అనే తేడా లేకుండా.. వర్షం పడిన సమయంలో రహదారులపైన, నీట మునిగే అవకాశం ఉన్న ప్రాంతాల్లో డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్సు చేసిన సేవలను ఆసక్తిగా అడిగి తెలుసుకుంటున్నారు. వరదకు గల కారణాలను తెలుసుకుని.. సమస్య తలెత్తకుండా తీసుకున్న చర్యల వీడియోలను ఆసక్తిగా పరిశీలిస్తున్నారు. హైడ్రా కమిషనర్ ఏవీ.రంగనాథ్ స్టాల్‌ను సందర్శించి ప్రతినిధులతో చర్చించడం.. సమస్య పరిష్కారంలో నిపుణుల సలహాలను స్వీకరించడం జరిగింది. వాతావరణంలో గణనీయ మార్పులు వచ్చాయి. పర్యావరణం దెబ్బతినడంతో కుండపోత వర్షాలు నగరాలను ముంచెత్తాయి. క్లౌడ్‌బరస్ట్‌లు ఏర్పడి ఒకే రోజు 15 నుంచి 20 సెంటీమీటర్ల వర్షం పడుతోంది. ఈ వర్షాలకు దేశంలోని అనేక పట్టణాలు అతలాకుతలం అయ్యాయి.
వర్షాలను అంచనా వేయడంతో పాటు.. వరద ముప్పు నివారణ వరకూ హైడ్రా తీసుకున్న చర్యలు ఈ ఏడాది మంచి ఫలితాల నిచ్చింది. వరద ముంచెత్తడానికి గల కారణాలను తెలుసుకుని.. సరైన చర్యలు తీసుకోవడంతో వరదముప్పు లేని నగరంగా హైదరాబాద్‌ను హైడ్రా తీర్చిదిద్దింది. మొదటి ఏడాదిలోనే హైడ్రా మంచి ఫలితాలు సాధించింది. భారీ వర్షాలు పడినా.. నగరంలో ఎక్కడా వరద ముప్పు లేకుండా జాగ్రత్తలు తీసుకుంది. పూడుకుపోయిన నాలాల్లో మట్టిని తీసింది. ఆక్రమణలను తొలగించి నాలాలను విస్తరించింది. దీంతో అమీర్‌పేట, సికింద్రాబాద్ ప్యాట్నీ ప్రాంతాల్లో లక్షలాదిమందికి ముంపు సమస్యను తప్పించింది. హైదరాబాద్ నగరం ఎంతో భద్రమో.. హైడ్రా డిజాస్టర్ రెస్పాన్స్( డీఆర్ఎఫ్) టీమ్‌ల పని తీరును వివరిస్తూ రూపొందించిన వీడియో ప్రదర్శన గ్లోబల్ సమ్మిట్‌కు వచ్చిన వారిని ఆకట్టుకుంటోంది. అలాగే హైడ్రా కార్యకలాపాలకు సంబంధించిన పోస్టర్‌ను పలవురు తీసుకుని పరిశీలించి ప్రశంసిస్తున్నారు. చెరువుల పునరుద్ధరణకు హైడ్రా తీసుకుంటున్న చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. చెరువులు, నాలాల పరిరక్షణ, పునరుద్ధరణ, పార్కులు కబ్జా కాకుండా చూడడం ఇవన్నీ చక్కటి పర్యావరణానికి... మెరుగైన జీవనం సాగించడానికి దోహదపడతాయని పలువురు పేర్కొంటున్నారు.






