భవిష్యత్తు అంతా యువజన కాంగ్రెస్ దే : మంత్రి పొన్నం

by Bhanu |   (  Updated:2025-04-30 11:26:09  IST  )

తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివ చరణ్ రెడ్డి ఆధ్వర్యంలో ఎల్బీనగర్ నియోజకవర్గంలోఎస్వీఎల్ కన్వెన్షన్ హాల్లో మంగళవారం రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు.

భవిష్యత్తు అంతా యువజన కాంగ్రెస్ దే : మంత్రి పొన్నం
X

దిశ, వనస్థలిపురం : తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివ చరణ్ రెడ్డి ఆధ్వర్యంలో ఎల్బీనగర్ నియోజకవర్గంలోఎస్వీఎల్ కన్వెన్షన్ హాల్లో మంగళవారం రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి యువజన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఉదయ్ భాను చిబ్, యువజన కాంగ్రెస్ జాతీయ ఇన్చార్జి కృష్ణ అల్లవారు, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనా రెడ్డి , టీపీసీసీ ప్రతినిధి జక్కిడి ప్రభాకర్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ నేతలు,మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ మాట్లాడుతూ...రానున్న దేశ భవిష్యత్తు యువతదే అన్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి యువజన కాంగ్రెస్ కృషి మరువలేనిది అన్నారు. దేశంలో బిజెపి నరేంద్ర మోడీ నిరంకుశ పరిపాలనకు యువత త్వరలోనే చరమగీతం పాడి.. రానున్న రోజుల్లో రాహుల్ గాంధీ గారిని ప్రధానిగా చూస్తామని తెలిపారు. యువజన కాంగ్రెస్ కు సీనియర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని, కాంగ్రెస్ పార్టీ కి యువజన కాంగ్రెస్ గుండెకాయలాంటిదని కొనియాడారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర కమిటీ, జిల్లా , నియోజకవర్గ మండల కమిటీ తదితర నాయకులు పాల్గొన్నారు.

Next Story