- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యువత సాంప్రదాయాలను గౌరవించాలి : మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు
హైదరాబాద్ బాగ్ లింగంపల్లి లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలోని కళా నిలయంలో ఆదివారం కృష్ణ ప్రసాద్ 21 సెంచరీ ఐఏఎస్ అకాడమీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశ కార్యక్రమంలో 2024 యూపీఎస్సీ ర్యాంకర్స్ 13మందికి హాజరైన ముఖ్య అతిథులు సన్మానం చేశారు.

దిశ,రాంనగర్ : హైదరాబాద్ బాగ్ లింగంపల్లి లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలోని కళా నిలయంలో ఆదివారం కృష్ణ ప్రసాద్ 21 సెంచరీ ఐఏఎస్ అకాడమీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశ కార్యక్రమంలో 2024 యూపీఎస్సీ ర్యాంకర్స్ 13మందికి హాజరైన ముఖ్య అతిథులు సన్మానం చేశారు. ఈ సందర్భంగా అన్ లిమిటెడ్ యుపిఎస్సి ఉత్సవ్ బ్రోచర్ ను ముఖ్య అతిథులుగా హాజరైన మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు రాష్ట్ర అడిషనల్ డీజీపీ యం.మహేష్ భగవత్, ఐఏఎస్ అకాడమీ చైర్మన్ పి. కృష్ణ ప్రదీప్ కలిసి ఆవిష్కరించారు.
అనంతరం మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు మాట్లాడుతూ భారతదేశం సంస్కృతికంగా వైవిద్య భరిత మైన దేశం, సివిల్ సర్వెంట్లు దేశ నిర్మాణంలో కీలకపాత్ర పోషించాల్సిన వెన్నుముకవలె ఉండాలన్నారు. ఈ వ్యవస్థను డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయాలను అనుసరించేలా నిర్మించాలని అన్నారు.
ఏ దేశం కూడా తమ స్వాతంత్రానికి భంగం కలిగే విధంగా కృతజ్ఞత చూపదనిపేర్కొన్నారు.యువత డిగ్నిటీని కాపాడుకొని ముందుకుసాగాల్సిన అవసరం ఉందన్నారు.ఈ నేపథ్యంలో భారతదేశం ముందుకు సాగుతుందని ప్రపంచంలో ఉత్తమ ఆర్థిక దేశంగా అన్ని రంగాల్లో పురోగతికి సాధ్యమవుతుందన్నారు. అడిషనల్ డిజిపి మహేష్ భగవత్ మాట్లాడుతూ.. ర్యాంకర్స్ తమ పునాదులను విస్మరించకుండా సమాజ పురోగతికి కృషి చేయాలని తెలిపారు. ఐఏఎస్ కు సిద్ధమవుతున్న అభ్యర్థులు సమయపాలన పాటించాలన్నారు. ఏ రోజు కారోజు సివిల్ సర్వీస్ పరీక్ష విధానం కఠిన తరంగా మారుతోందని అందుకు అనుగుణంగా అభ్యర్థులు నిర్మాణాత్మక ప్రణాళికతో పరీక్షలకు సిద్ధం కావాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఐఏఎస్ రిటైర్డ్ ఏం గోపాలకృష్ణ, బీ.పీ ఆచార్య , విఎన్ విష్ణు, చక్రపాణి, డాక్టర్ ఆర్ అనంతమ్మ పద్మనాభరావు, టి చిరంజీవులు, ప్రొఫెసర్ సి గణేష్ , డైరెక్టర్ డాక్టర్ భవాని,తదితరులు పాల్గొన్నారు.






