- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సోషల్ మీడియా ద్వారా మహిళలను వలలో వేసి బ్లాక్‌మెయిల్.. యువకుడు అరెస్ట్
సోషల్ మీడియా వేదికల ద్వారా మహిళలను పరిచయం చేసుకుని, వారిని నమ్మించి సన్నిహిత దృశ్యాలను రికార్డు చేసి బ్లాక్‌మెయిల్ చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్న యువకుడిని గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేశారు.

దిశ, శేరిలింగంపల్లి,: సోషల్ మీడియా వేదికల ద్వారా మహిళలను పరిచయం చేసుకుని, వారిని నమ్మించి సన్నిహిత దృశ్యాలను రికార్డు చేసి బ్లాక్‌మెయిల్ చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్న యువకుడిని గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని గచ్చిబౌలి ఇన్‌స్పెక్టర్ బాలరాజు వెల్లడించారు. పోలీసుల వివరాల ప్రకారం, కిలారి నాగతేజ అలియాస్ నాని (24) స్నాప్‌చాట్‌తో పాటు ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా మహిళలతో పరిచయం పెంచుకునేవాడు. ప్రేమిస్తున్నానని నమ్మించి, హోటళ్లకు రమ్మని ఒప్పించి, అక్కడ సన్నిహిత ఫోటోలు, వీడియోలు చిత్రీకరించేవాడు. అనంతరం బాధితులను నగ్నంగా ఫోజులు ఇవ్వాలని బలవంతం చేసి, ఆ దృశ్యాలను చూపిస్తూ బెదిరించి డబ్బులు డిమాండ్ చేసేవాడు. కొంతమంది బాధితుల వీడియోలను ఆన్‌లైన్‌లో విక్రయించి అక్రమంగా సొమ్ము కూడా చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. తాజాగా ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గచ్చిబౌలిలోని డీఎల్‌ఎఫ్ గేట్ నెం.3 ఎదురుగా ఉన్న ఎల్లో స్టోన్ హోటల్‌లోని రూమ్ నెం.101లో నిందితుడు బాధితురాలిని బంధించి, కత్తితో బెదిరించి ఆమె నగ్న ఫోటోలు, వీడియోలు రికార్డు చేశాడని గుర్తించారు. అనంతరం ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫర్ల ద్వారా రూ.1.10 లక్షలు వసూలు చేసినట్లు విచారణలో వెల్లడైంది. దీంతో నిందితుడు కిలారి నాగతేజ అలియాస్ నానిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రెండు మొబైల్ ఫోన్లు, నేరానికి ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై మరింత దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.






