- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బంగారం పోయిందన్న మనస్తాపంతో మహిళ ఆత్మహత్య
బంగారం పోయిందని మనస్తాపం చెంది ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. వనస్థలిపురం సీఐ సీహెచ్శ్రీనివాస్వివరాల ప్రకారం.. చింతలకుంటలోని ఆగమయ్య కాలనీకి చెందిన సత్యనారాయణ, గోపిక గీతారాణి దంపతుల కుమార్తె సుధేష్ణ(28)ని అమ్మదయ కాలనీలో ఉంటున్న నోముల ఆశిష్ కుమార్ తో ఐదేండ్ల కింద వివాహం జరిగింది.

దిశ, వనస్థలిపురం: బంగారం పోయిందని మనస్తాపం చెంది ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. వనస్థలిపురం సీఐ సీహెచ్శ్రీనివాస్వివరాల ప్రకారం.. చింతలకుంటలోని ఆగమయ్య కాలనీకి చెందిన సత్యనారాయణ, గోపిక గీతారాణి దంపతుల కుమార్తె సుధేష్ణ(28)ని అమ్మదయ కాలనీలో ఉంటున్న నోముల ఆశిష్ కుమార్ తో ఐదేండ్ల కింద వివాహం జరిగింది. వీరికి నాలుగేండ్ల కుమారుడు ఉన్నాడు. కాగా సుధేష్ణ ఈ నెల 16న నాచారంలోని స్వాగత్ ఫంక్షన్ హాల్ జరిగిన బంధువుల శుభకార్యానికి వెళ్లింది. ఆ ఫంక్షన్లో సుధేష్ణ కు చెందిన 7 తులాల బంగారు గొలుసు పోయింది. దీంతో మనస్తాపం చెందిన సుధేష్ణ మంగళవారం తెల్లవారుజామున వారు నివసిస్తున్న భవనంలోని మూడో అంతస్తు నుంచి తన బాబును తీసుకొని కిందకు దూకింది. ఈ ప్రమాదంలో సుధేష్ణ తీవ్రంగా గాయపడడంతో దగ్గరలో ఉన్న కామినేని ఆస్పత్రికి తీసుకువెళ్లగా, అక్కడ చికిత్స పొందుతూ సాయంత్రం మృతి చెందింది. బాబు స్వల్ప గాయాలతో ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డాడు. ఈ మేరకు కేసు నమోదర్యాప్తు చేస్తున్నారు.






