కొత్త రైల్వే లైన్​తో తెలుగు రాష్ట్రాలకు ఎంతో మేలు

by Sridhar Babu |

పాండురంగాపురం - భద్రాచలం-మల్కన్ గిరి కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టుతో తెలుగు రాష్ట్రాలకు ఎంతో మేలు కలుగుతుందని కేంద్ర రైల్వేలు, సమాచార, ప్రసార , ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు.

కొత్త  రైల్వే లైన్​తో తెలుగు రాష్ట్రాలకు ఎంతో మేలు
X

దిశ, సికింద్రాబాద్ : పాండురంగాపురం - భద్రాచలం-మల్కన్ గిరి కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టుతో తెలుగు రాష్ట్రాలకు ఎంతో మేలు కలుగుతుందని కేంద్ర రైల్వేలు, సమాచార, ప్రసార , ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. అత్యంత ప్రాధాన్యతతో చేపట్టిన పాండురంగాపురం - భద్రాచలం – మల్కన్ గిరి కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టు గిరిజన ప్రాంతాల ద్వారా నూతన రైలు మార్గాన్నిఅందిస్తూ ఇది అసన్సోల్, వరంగల్ మధ్య ప్రత్యామ్నాయ రైలు మార్గంగా అందుబాటులోకి తీసుకువస్తున్నామని తెలిపారు. నూతననంగా మంజూరైన రైల్వే ప్రాజెక్టుల వివరాలను మంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీడియాకు వెల్లడించారు. ఈ కారీడార్లో భాగంగా పశ్చిమ బెంగాల్లోని అసన్సోల్ నుంచి వరంగల్ వరకు కలిపేలా సరికొత్త కారీడార్ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. జునాగడ్, నవరంగ్పూర్, మల్కన్ గిరి, పాడురంగాపురం వయా భద్రాచలం రైల్వే లైన్లు ఈ కారీడార్లో భాగంగా ఉంటాయని రూ. 7,383 కోట్లతో 290 కిలో మీటర్ల మేర ఈరెండు కారీడార్లు ఏర్పాటు అవుతాయన్నారు.

ఈ ప్రాజెక్టు ద్వారా ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాలు ఎంతో ప్రయోజనం పొందుతాయని పేర్కొన్నారు. ఇది ఉత్తర , తూర్పు భారతదేశానికి అదనపు రైలు కారీడార్ అవుతుందని, దక్షిణ భారతదేశంలోని థర్మల్ పవర్ ప్లాంట్లకు బొగ్గును వేగంగా చేరవేయడానికి, అల్యూమినియం, ఇనుప ఖనిజ పరిశ్రమలకు మెరుగైన అనుసంధానాన్ని కల్పించడంలో ప్రయోజనకారిగా సహాయపడుతుందన్నారు. ఈ కొత్త లైన్ ఆంధ్ర, తెలంగాణలలో వ్యవసాయ ఉత్పత్తులకు విస్తృత మార్కెట్​ కూడా అందిస్తుందని , ఇది ఇప్పటికే ఉన్న విజయవాడ- విశాఖపట్నం-భువ నేశ్వర్- కోల్‌కతా కోస్తా తీర ప్రాంతానికి నూతనంగా నిర్మిస్తున్న వరంగల్,-భద్రాచలం-,మల్కన్ గిరి - జైపూర్, - టిట్లాగడ్​కు అదనపు రైలు మార్గాన్ని అందిస్తుందని తెలిపారు. గతంలో వామపక్ష తీవ్రవాదం వల్ల ప్రభావితమైన కలహండి , నవరంగ్పూర్ , కోరాపుట్, రాయగడ్ , మల్కన్ గిరి గిరిజన జిల్లాలకు ఈ లైన్ అనుసంధానాన్నిఅందిస్తుందని చెప్పిన మంత్రి ఇప్పటికే ఈ జిల్లాల్లో ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభమయ్యాయని,

శాంతి పునరుద్ధరణ సైతం జరుగుతోందన్నారు. ఈ కారీడార్ మహానది బొగ్గు క్షేత్ర ప్రాంతాల నుండి మధ్య ,దక్షిణ భారతదేశంలో ఉన్న పవర్ ప్లాంట్లకు త్వరిత అనుసంధానాన్ని అందిస్తుందని చెప్పారు. అలాగే ఈ కొత్త రైలు మార్గంతో భద్రచలం దేవస్థానం వద్ద కొత్త రైల్వేస్టేషన్ ఏర్పాటు చేస్తామని, దీని వల్ల భద్రచలం దేవాలయానికి వెళ్లే భక్తులకు మరింత సౌకర్యవంతంగా ఉంటుందని చెప్పారు. కొత్త రైల్వే లైన్ విపత్తుల సమయంలో ప్రత్యామ్నాయ రైలు మార్గంగా ఉపయోగపడుతుందని తెలిపారు. తుఫానుల సమయంలో హౌరా-–విజయవాడ తీర మార్గంలో ప్రస్తుతం ఉన్న మార్గాల అనుసంధానం దెబ్బతింటే ఈ ప్రత్యామ్నాయ

కొత్త రైల్వే లైన్ ఒడిశాలోని వివిధ జిల్లాలకు అనుసంధానాన్ని అందిస్తుందన్నారు. ఇది ఈ ప్రాంతానికి ఆహార ధాన్యాలు, ఎరువులు, వ్యవసాయ ఉత్పత్తులు, సిమెంటును సులభంగా అందించేందుకు కూడా ఉపయోగపడుతోందని చెప్పారు. ఈ కొత్త రైల్వే లైన్ ద్వారా బస్తర్ ప్రాంతం నుండి దక్షిణ భారతదేశానికి 124 కిలో మీటర్ల దూరం తగ్గుతుందని, రాజమండ్రి– విశాఖపట్నం వంటి రద్దీ కారీడార్‌లను దాటవేస్తూ ప్రత్యామ్నాయ మార్గంగా కూడా పని చేస్తుందన్నారు. ఈ ప్రాజెక్ట్ కోటి పనిదినాల ఉపాధిని సృష్టిస్తుందని, అలాగే 3 కోట్ల 80 లక్షల చెట్ల పెంపకానికి సమానమైన 267 కోట్ల కిలోల కార్బఫూట్ ప్రింట్స్ను తగ్గిస్తుందని చెప్పారు.

Next Story