- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా బ్రిడ్జికి మోక్షం లభించేనా..?
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట లింగన్నపేట మధ్యనలో లెవెల్ వంతెన ఉంది. ఏటా ప్రాజెక్టు మత్తడి దూకడంతో నీట మునిగి రవాణా స్తంభించి రాకపోకలు నిలిచిపోవడంతో ప్రజలు నానావస్థలు పడుతున్నారు.

దిశ, గంభీరావుపేట : రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట లింగన్నపేట మధ్యనలో లెవెల్ వంతెన ఉంది. ఏటా ప్రాజెక్టు మత్తడి దూకడంతో నీట మునిగి రవాణా స్తంభించి రాకపోకలు నిలిచిపోవడంతో ప్రజలు నానావస్థలు పడుతున్నారు. గంభీరావుపేట మండలంలో ఉన్న నాయకులు తమ జేబులు నింపుకుంటున్నారని, మండల అభివృద్ధికి ఏ ఒక్క నాయకుడు కూడా ముందుకు వస్తలేరని వాట్సాప్ గ్రూప్ లో చర్చలు మొదలయ్యాయి. ఇప్పుడు స్థానిక ఎన్నికలు ప్రజల దగ్గరికి ఎలా పోయి ఓట్లు అడుగుతారని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ స్థానిక ఎన్నికల్లోనైనా విద్యావంతులు పోటీ చేయాలని పలువురు కోరుతున్నారు. గతంలో హై లెవెల్ వంతెన నిర్మాణానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వ మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే కేటీఆర్ 2023 సెప్టెంబర్ 27న రూ. 10 కోట్ల 60 లక్షలతో శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత రెండు నెలలకే ఎన్నికలు జరగగా, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2023 డిసెంబర్ 16న పనులు ప్రారంభించగా పిల్లర్ల స్థాయిలోనే నిలిచిపోయాయి. లో లెవెల్ వంతెన తొలగించి వాహనాల రాకపోకలకు పక్క నుంచి తాత్కాలిక మట్టి రోడ్డు వేయగా, 2024 ఆగస్టులో వచ్చిన వరదల్లో కొట్టుకపోయింది. ఆ తర్వాత కొద్ది రోజులకు మళ్లీ తాత్కాలికంగా మట్టి రోడ్డు వేసినప్పటికీ ఇటీవల భారీ వర్షాలకు ఎగువ మానేరు మత్తడి దుంకడంతో ఉన్న మట్టి రోడ్డు పూర్తిగా పుట్టుక పోయింది.
ఏడు కిలోమీటర్లు అదనపు భారం
గంభీరావుపేట- లింగన్నపేట మధ్యన వాగు పై రోడ్డు కొట్టుకపోవడంతో అటు నుంచి ఇటు, నుంచి అటు వెళ్లే ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గంభీరావుపేట కేజీ టు పీజీ విద్యాలయానికి మరియు మోడల్ స్కూల్ కి వెళ్లేందుకు విద్యార్థులు, ఉపాధ్యాయులు వడరాని పాట్లు పడుతున్నారు. కామారెడ్డి సిద్దిపేట ప్రధాన రహదారి కావడంతో ఆర్టీసీ బస్సులు ఇటు నర్మల, అటు మల్లారెడ్డిపేట మీదిగా అదనంగా ఏడు కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. వాగులో వరద ప్రవాహం తగ్గి రోజులు గడుస్తున్న తాత్కాలిక రోడ్డును ఎందుకు పునరుద్దరించడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. హై లెవెల్ వంతెన కోసం గతంలో ఉన్న లో లెవెల్ వంతెనను గుత్తేదారు అవగాహన లోపంతో కూల్చివేశారని ప్రజలు మండిపడుతున్నారు. పాత వంతెన పక్క నుంచి కొత్తగా బ్రిడ్జి నిర్మించాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా లోకల్ లో ఉన్న నాయకుల స్వార్థం కోసం పాత బ్రిడ్జిని కూల్చివేసి అదే స్థానంలో కొత్త బ్రిడ్జి నిర్మించినట్లయితే ఏ ఒక్కరికి నష్టం జరగకుండా ఉండేదన్నారు. గతంలో అధికారులతో కుమ్మక్కై ఉన్న బ్రిడ్జిని సర్వనాశనం చేశారు. ప్రతిసారి వర్షాలు పడినప్పుడు వరదలు రావడంతో ప్రతి ఏటా ఇదే దుస్థితి నెలకొంటుంది.






