వ‌న్య‌ప్రాణుల వేట‌గాళ్లు అరెస్ట్

by Ratna Kumari |

వ‌న్య‌ప్రాణుల వేటాడి తిన్న‌ట్టు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు అందిన సమాచారంతో అటవీ శాఖ అధికారులతో కలిసి వన్యప్రాణులను వేటాడుతున్న హైదరాబాద్ కు చెందిన ఆరుగురిని మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు.

వ‌న్య‌ప్రాణుల వేట‌గాళ్లు అరెస్ట్
X

దిశ, సిటీ క్రైం : వ‌న్య‌ప్రాణుల వేటాడి తిన్న‌ట్టు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు అందిన సమాచారంతో అటవీ శాఖ అధికారులతో కలిసి వన్యప్రాణులను వేటాడుతున్న హైదరాబాద్ కు చెందిన ఆరుగురిని మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం...అలీజాకోట్ల ప్రాంతానికి చెందిన మహ్మద్ ముజఫర్, అబ్దుల్లా బిన్ సాహేన్, మహ్మద్ బలాబ్, మసూద్ బిన్, జడ్చర్ల కు చెందిన మహ్మద్ బిన్ అమీర్, శేఖర్ స్నేహితులు. శేఖర్ కు షాద్ నగర్, మక్తల్ అటవీ ప్రాంతాల్లో నెమళ్లు, జింకలు, కుందేళ్ళు, అడవి పందిలు ఎక్కడ ఉంటాయో తెలుసు. ఈ సమాచారాన్ని తన స్నేహితులకు చెప్పడంతో వారంతా గత ఏడాది నుంచి ఈ అటవీ ప్రాంతాల్లో హంటింగ్ చేస్తున్నారు.

ఇప్పటి వరకు ఈ ఆరుగురు కలిసి దాదాపు 4 నెమళ్లు, 4 జింకలను చంపి వాటిని వండుకుని తినేశారని పోలీసుల దర్మాప్తులో తేలింది. ఈ నేపథ్యంలో పోలీసులు, అటవీ శాఖ అధికారులు కలిసి వీరిని అదుపులోకి తీసుకున్నారు. వారి మొబైల్ ఫోన్ లలో వేట కు సంబంధించిన విడియోలను పోలీసులు గుర్తించారు. ఈ ముఠాలో ఉన్న అహ్మద్ అమీర్ తెలంగాణ రైఫిల్ అసోసియేషన్ సభ్యుడిగా గుర్తించారు. వీరి వద్ద నుంచి 4 ఎయిర్ గన్ లు, ఒక రైఫీల్, 20 బుల్లెట్ లు, 8 మొబైల్ ఫోన్ లు, కారును స్వాధీనం చేసుకుని దర్యాప్తును ముమ్మరం చేశారు. శేఖర్ కమీషన్ లు తీసుకుని ఈ వేటగాళ్లకు వన్యప్రాణులు అధికంగా సంచరించే ప్రాంతాలను చూపిస్తాడని దర్యాప్తులో బయటపడింది. జూరాల‌ బ్యాక్ వాటర్ లో ఈ వన్యప్రాణలు కళేబరాలను పడేసే వారని విచార‌ణలో వెల్ల‌డించిన‌ట్టు స‌మాచారం.

Next Story