వైట్ టీ షర్ట్ శిక్షణ శిబిరాన్ని సందర్శించిన మంత్రి శ్రీధర్ బాబు

by Bhanu |

గత రెండు రోజులుగా తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు జక్కిడి శివ చరణ్ రెడ్డి ఆధ్వర్యంలో మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా కీసర బాల వికాస కేంద్రంలో యూత్ కాంగ్రెస్ "వైట్ టీ షర్ట్" శిక్షణ శిబిరాన్ని ఐటీ, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు శుక్రవారం సందర్శించారు.

వైట్ టీ షర్ట్ శిక్షణ శిబిరాన్ని సందర్శించిన మంత్రి శ్రీధర్ బాబు
X

దిశ, హిమాయత్ నగర్ : గత రెండు రోజులుగా తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు జక్కిడి శివ చరణ్ రెడ్డి ఆధ్వర్యంలో మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా కీసర బాల వికాస కేంద్రంలో యూత్ కాంగ్రెస్ "వైట్ టీ షర్ట్" శిక్షణ శిబిరాన్ని ఐటీ, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ ప్రారంభించిన ఈ "వైట్ టీ షర్ట్" కార్యక్రమం అద్భుతమని అన్నారు. దీని ద్వారా బీజేపీ ప్రభుత్వానికి భంగపాటు తప్పదని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని యూత్ కాంగ్రెస్ నేతలు రాష్ట్రమంతటా ప్రతి జిల్లా కు తీసుకువెళ్లాలని కోరారు.


ఖైరతాబాద్ జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అనీష్ గంగపుత్ర మాట్లాడుతూ.. వైట్ టీ షర్ట్ కార్యక్రమం యూత్ కాంగ్రెస్ నేతలకు దిశా నిర్దేశకంగా ఉపయోగపడుతుందని,అసమానతలు లేని సమాజాన్ని చూడడమే రాహుల్ గాంధీ ముఖ్య ఉద్దేశం మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. కార్యక్రమంలో జాతీయ యువజన కాంగ్రెస్ నాయకులు మనీష్ శర్మ , మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా డీసీసీ అధ్యక్షులు హరివర్ధన్ రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గ ఇంచార్జ్ వజ్రెష్ యాదవ్, రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఇంచార్జ్ సయ్యద్ ఖలీద్, జాతీయ యువజన కాంగ్రెస్ కార్యదర్శి శ్రావణ్ రావు , తదితరులు పాల్గొన్నారు.

Next Story