కంటి క్యాన్సర్ పై అవగాహనే లక్ష్యంగా 'వైట్ థాన్' రన్

by Bhanu |

పిల్లలకు వచ్చే కంటి క్యాన్సర్ పై అవగాహన, చికిత్సకు విరాళాల నిమిత్తం ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో ఆదివారం రాయదుర్గంలోని టీ-వర్క్స్ వద్ద నిర్వహించిన 'వైట్ థాన్' 10కే రన్ ను రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన, అగ్నిమాపక సేవల డైరెక్టర్ జనరల్ వై. నాగిరెడ్డి ప్రారంభించారు.

కంటి క్యాన్సర్ పై అవగాహనే లక్ష్యంగా వైట్ థాన్ రన్
X

దిశ, శేరిలింగంపల్లి: పిల్లలకు వచ్చే కంటి క్యాన్సర్ పై అవగాహన, చికిత్సకు విరాళాల నిమిత్తం ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో ఆదివారం రాయదుర్గంలోని టీ-వర్క్స్ వద్ద నిర్వహించిన 'వైట్ థాన్' 10కే రన్ ను రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన, అగ్నిమాపక సేవల డైరెక్టర్ జనరల్ వై. నాగిరెడ్డి ప్రారంభించారు. ఎల్వీ ప్రసాద్ ఆధ్వర్యంలో ఇది ఏడవ రన్. ఈ 10కే రన్ లో ప్రజలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అగ్నిమాపక సేవల డైరెక్టర్ జనరల్ వై నాగిరెడ్డి మాట్లాడుతూ.. ఈ వైట్ థాన్ ద్వారా తెలుసుకున్న సమాచారాన్ని మన పరిధిలో ఉన్న వారితో పంచుకోవాలన్నారు. తద్వారా చిన్న పిల్లల్లో వచ్చే ఈ క్యాన్సర్ ను ముందుగా గుర్తించేందుకు సహాయపడవచ్చన్నారు. ఎంతో మంది చూపును, ప్రాణాలను రక్షించవచ్చన్నారు. ఈ వ్యాధిని పిల్లల్లో గుర్తించేందుకు తల్లిదండ్రులు ప్రయత్నం చేయాలన్నారు. ఫొటోలు తీసేటప్పుడు ఫ్లాష్ ఆఫ్ చేసి ఫోటోలు తీయాలన్నారు.


ఈ సందర్భంగా ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రశాంత్ గార్గ్ మాట్లాడుతూ ప్రతి చిన్నారి కంటిని, ప్రాణాన్ని రెటినోబ్లాస్టోమా నుంచి కాపాడాలన్నారు. ఈ వ్యాధిని ముందుగా గుర్తించి చికిత్స చేస్తే కంటిని, ప్రాణాన్ని కాపాడవచ్చని తెలిపారు. దేశంలో ఏ ప్రాంతంలో కూడా ఈ కణితి కారణంగా ఏ ఒక్కరూ చనిపోకూడదన్నారు. వైటథాన్ ద్వారా సమకూరిన నిధులతో ఇప్పటి వరకు మూడు వేలకు పైగా చికిత్సలు ఉచితంగా చేశామన్నారు. ప్రతి సంవత్సరం కంటి క్యాన్సర్ తో కొత్త కేసులు 150 నుంచి 200 వరకు వస్తుంటాయన్నారు. వీరిలో చికిత్స పొందిన కేసుల్లో 90 శాతం మంది పిల్లల ప్రాణాలు రక్షించామన్నారు. ఈ వైట్ థాన్ రన్ ఆయా విభాగాల్లో గెలుపొందిన విజేతలకు రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన, అగ్నిమాపక సేవల డైరెక్టర్ జనరల్ వై. నాగిరెడ్డి బహుమతులు ప్రధానం చేశారు.




Next Story