- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఎదురుదెబ్బ తప్పదు: విప్ ఆది శ్రీనివాస్
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ తీరు... దొంగే దొంగ అన్నట్టుగా ఉందని విప్ ఆదిశ్రీనివాస్ అన్నారు....

దిశ, తెలంగాణ బ్యూరో: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ తీరు... దొంగే దొంగ అన్నట్టుగా ఉందని విప్ ఆదిశ్రీనివాస్ అన్నారు. గురువారం గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీ.ఆర్.ఎస్ కు ఎదురుదెబ్బ తప్పదని జోస్యం చెప్పారు. 10 ఏళ్ల పాటు ఫోన్ ట్యాపింగ్ చేసి దొరికిపోయిన దొంగలు.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆడిపోసుకునే విధంగా సొంత ప్రత్రికలో రోత రాతలు రాస్తున్నారని, ఫోన్ ట్యాపింగ్ దొంగల పాపం పండిదని, లోక్ సభ ఎన్నికలో గుండు సున్నా కు పరిమితమయ్యారని ఆయన అన్నారు. ట్యాపింగ్ సూత్రధారులు, పాత్రధారులు పాత్ర తేలాల్సి ఉందని, నిందితులు కలుగులో దాకున్న కూడా వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
ఫోన్ ట్యాపింగ్ తో సినీతారలు, జడ్జీలు, భార్య భర్తలు మాట్లాడుకున్న మాటలను విన్నారని కవితే బహిరంగంగా చెబుతున్నారని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ.. బీఆర్ఎస్ లో నియంతృత్వ పోకడలు ఎక్కువ.. అని అన్నారు. మా ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీకి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు గుణ పాఠం చెబుతారని అన్నారు. కేసీఆర్ ప్రతిపక్ష పాత్ర పోషించలేక ఫాం హౌస్ కి పరిమితమయ్యారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి తెలంగాణ పదం తొలగించిన రోజే ఆ పార్టీకి, రాష్ట్ర ప్రజలకు ఉన్న పేగు బంధం తెగిపోయిందని అన్నారు. మహాలక్ష్మి పథకంతో మహిళలకు ఎంతో ప్రయోజనం పొందారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గత పదేళ్ల హయంలో పది రేషన్ కార్డులు ఇవ్వలేదు. ఏ ఒక్క నియోజక వర్గంలో ఒక్క డబుల్ బెడ్ రూం ఇచ్చిన పాపాన పోలేదని విమర్శించారు. ధనిక రాష్ట్రం కాస్తా రూ.7 లక్షల కోట్లకు అప్పులు కట్టే దుస్థితి తీసుకొచ్చారని మండిపడ్డారు. ఎస్సీ వర్గీకరణ, బీసీ కుల గణన చేపట్టి కాంగ్రెస్ ప్రభుత్వం చిత్త శుద్ధి నిరూపించుకుందని పేర్కొన్నారు.






