- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీసీసీఐ అనుమతి ఎక్కడ..? HCA ను ప్రశ్నించిన టీసీఏ
తెలంగాణ క్రికెట్‌లో టీజీ-20 లీగ్ వివాదం మరింత వేడెక్కుతోంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా ప్రచారం చేస్తున్న టీజీ-20 లీగ్ కు సంబంధించి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ HCA కు అధికారిక లీగల్ నోటీసు జారీ చేసింది.

దిశ, సికింద్రాబాద్ : తెలంగాణ క్రికెట్‌లో టీజీ-20 లీగ్ వివాదం మరింత వేడెక్కుతోంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా ప్రచారం చేస్తున్న టీజీ-20 లీగ్ కు సంబంధించి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ HCA కు అధికారిక లీగల్ నోటీసు జారీ చేసింది. ఈ వ్యవహారంపై తక్షణ జోక్యం చేసుకోవాలని కోరుతూ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి అత్యవసర వినతి పత్రం సమర్పించింది. టీజీ20 లీగ్ నిర్వహణకు సంబంధించి ఎటువంటి అధికారిక అనుమతులు, ఆమోదాలు లేదా బీసీసీఐ మంజూరులు లభించాయో రాతపూర్వకంగా స్పష్టం చేయాలని TCA డిమాండ్ చేసింది. టీజీ20 గవర్నింగ్ కౌన్సిల్ ఏర్పాటుకు HCA జనరల్ బాడీ ఆమోదం తీసుకున్నదా అనే విషయాన్ని కూడా వెల్లడించాలని కోరింది. ఈ సందర్భంగా టీసీఏ ప్రధాన కార్యదర్శి ధరం గురువ రెడ్డి మాట్లాడుతూ, ఎటువంటి అనుమతి పత్రాలు లేదా అధికారిక కమ్యూనికేషన్లు చూపించకుండా HCA పదే పదే బీసీసీఐ ఆమోదం ఉంది అంటూ ప్రచారం చేయడం కార్పొరేట్లు, ఫ్రాంచైజీలు, ఆటగాళ్లు క్రికెట్ వర్గాలను తప్పుదోవ పట్టించే చర్యగా అభివర్ణించారు.
అధికారిక ఈ మెయిల్స్, వినతులకు సరైన సమాధానాలు ఇవ్వకుండా HCA బాధ్యత నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. హైదరాబాద్ వెలుపల జిల్లాల్లో గత 12 సంవత్సరాలుగా టీసీఏ ఆధ్వర్యంలో క్రికెట్ అభివృద్ధి కార్యక్రమాలు పారదర్శకంగా కొనసాగుతున్నాయని, బీసీసీఐ 2021 జూలై 11వ తేదీ ఆదేశాల ప్రకారం.. HCA , టీసీఏ సంప్రదింపులు జరిపి కలిసి పనిచేయాల్సి ఉందని గుర్తు చేశారు. ఇదే సమయంలో జిల్లాల ప్రతిభావంతులైన ఆటగాళ్లకు అవకాశాలు కల్పించే లక్ష్యంతో “తెలంగాణ ప్రీమియర్ లీగ్ (TPL)”ను జూన్ 2026లో పారదర్శక ఎంపిక విధానంతో ప్రారంభించనున్నట్లు టీసీఏ ప్రకటించింది. హెచ్సీఏ చేస్తున్న ధృవీకరించని ప్రకటనలను నమ్మి కార్పొరేట్లు, స్పాన్సర్లు, బ్రాడ్‌కాస్టర్లు, వెండర్లు ఆర్థిక లేదా ప్రతిష్టాత్మక నష్టాలకు గురికావొచ్చని టీసీఏ హెచ్చరించింది. ఇప్పటికే ఈ అంశంపై బాంబే హైకోర్టులో W.P. No. 3678/2023 విచారణ కొనసాగుతోందని, ఈ సమయంలో హెచ్సీఏ ఏకపక్షంగా లీగ్ ప్రకటించడం న్యాయ ప్రక్రియను ప్రభావితం చేసే ప్రయత్నమేనని పేర్కొంది. 48 గంటల్లోగా బీసీసీఐ ఈ అంశంపై స్పష్టత ఇవ్వాలని, లేకపోతే సంబంధిత వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ హెచ్చరించింది.






