హైదరాబాద్‌ నగరవాసులకు అలర్ట్.. 2 రోజులు వాటర్ సప్లై బంద్

by Ramesh Naini |

హైదరాబాద్‌లో రెండు రోజుల పాటు ప్రభుత్వ వాటర్ సప్లై బంద్ కానుంది.

హైదరాబాద్‌ నగరవాసులకు అలర్ట్.. 2 రోజులు వాటర్ సప్లై బంద్
X

దిశ, డైనమిక్ బ్యూరో: (Hyderabad) హైదరాబాద్‌లో రెండు రోజుల పాటు ప్రభుత్వ వాటర్ సప్లై (Water supply) బంద్ కానుంది. ఈ మేరకు తాజాగా HMWS&SB అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. గోదావరి ఫేజ్-1 ప్రాజెక్టులో ప్రధాన వాల్వ్ రీప్లేస్‌మెంట్ పనుల కారణంగా సెప్టెంబర్ 9 ఉదయం 6 గంటల నుండి సెప్టెంబర్ 11 ఉదయం 6 గంటల వరకు రెండు రోజుల పాటు నీటి సరఫరా ఉండదని అధికారులు వెల్లడించారు. గోదావరి నీటిని పంప్ చేసే ముర్ముర్, మల్లారం, కొండపాక పంపింగ్ స్టేషన్లలో పంపింగ్ మెయిన్‌ను మూసివేయాలని HMWS&SB ప్రతిపాదించింది. దీంతో రెండు రోజుల పాటు హైదరాబాద్‌లోని అనేక ప్రాంతాల్లో మంగళ, బుధవారాల్లో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది.

ముఖ్యంగా డివిజన్-6 లో ఎస్ఆర్ నగర్, సనత్ నగర్, బోరబండ, ఎస్పీఆర్ హిల్స్, ఎర్రగడ్డ, బంజారాహిల్స్, వెంకటావు నగర్, ఎల్లారెడ్డిగూడ, సోమాజిగూడ, ఫతేనగర్, జూబ్లీహిల్స్ అంతరాయం ఏర్పడనుంది. అలాగే డివిజన్-4, డివిజన్-7, డివిజన్-8, డివిజన్-9, డివిజన్-12, డివిజన్ -14 , డివిజన్-15, డివిజన్-17, డివిజన్-19, డివిజన్-21, డివిజన్-22లోని ప్రాంతాలు అంతరాయాన్ని ఎదుర్కొంటాయని తెలిపారు. అదేవిధంగా ఆలేరు, మేడ్చల్, శామీర్ పేట్ పరిధిలో నీటి సరఫరా నిలిపివేయనున్నారు. ఈ మేరకు పనులు పునరుద్దరణ అయ్యేంత వరకు తగినంత నీటిని ముందే నిల్వ చేసుకోవాలని ప్రజలకు జలమండలి విజ్ఞప్తి చేసింది.

Next Story