- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మరోసారి జంట జలాశయాల నుంచి నీటి విడుదల.. పరవళ్లు తొక్కుతున్న మూసీ..
హైదరాబాద్ నగర శివార్లలో ఉన్న జంట జలాశయాలైన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్‌ల గేట్లను జలమండలి అధికారులు మరోసారి ఎత్తారు.

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ నగర శివార్లలో ఉన్న జంట జలాశయాలైన హిమాయత్ సాగర్(Himayat Sagar), ఉస్మాన్ సాగర్(Osman Sagar)ల గేట్లను జలమండలి అధికారులు మరోసారి ఎత్తారు. వరద ప్రవాహం, వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడంతో అప్రమత్తమైన జలమండలి అధికారులు.. జంట జలాశయాలు సందర్శించి ముందస్తు జాగ్రత్తగా నీటిని విడుదల చేయాలని జల మండలి ఎండీ అశోక్ రెడ్డి ఆదేశించారు. ఎప్పటికప్పుడు వరద పరిస్థితిని అంచనా వేస్తూ అప్రమత్తంగా ఉండాలని జలమండలి ఎండీ అధికారులకు సూచించారు. ఈ మేరకు అధికారులు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాల గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. దీంతో మూసీ నది మరోసారి పరవళ్లు తొక్కుతోంది.
ఉస్మాన్ సాగర్ మూడు గేట్లను ఒక అడుగు మేర ఎత్తి.. అధికారులు దిగువకు నీరు విడుదల చేశారు. పూర్తిస్థాయి నీటిమట్టం 1790 అడుగులు కాగా.. ప్రస్తుతం 1789.40 అడుగుల మేర వరద నీరు ప్రవహిస్తోంది. ఇన్‌ఫ్లో 300 క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో 2028 క్యూసెక్కులు ఉంది. హిమాయత్ సాగర్ రెండు గేట్లను మూడు అడుగుల మేర ఎత్తి.. దిగువకు నీరు విడుదల చేశారు. పూర్తిస్థాయి నీటిమట్టం 1763.50 అడుగులు కాగా.. ప్రస్తుతం 1760.40 అడుగుల మేర వరద నీరు పారుతుంది. ఇన్‌ఫ్లో 400 క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో 2000 క్యూసెక్కులు ఉందని అధికారుల సమాచారం.ఈ నేపథ్యంలోనే.. పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.






