వార్నీ.. హాస్టల్ లో ఉంటూ ఇంత పని చేస్తారా..?

by Naveena |

ఖైరతాబాద్ లోని హాస్టల్స్ లో ఉంటూ గంజాయి అమ్ముతున్న ముఠాను సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వార్నీ.. హాస్టల్ లో ఉంటూ ఇంత పని చేస్తారా..?
X

దిశ, ఖైరతాబాద్ : ఖైరతాబాద్ లోని హాస్టల్స్ లో ఉంటూ గంజాయి అమ్ముతున్న ముఠాను సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముఠా సభ్యులంతా 30 ఏళ్ల లోపు యువకులే ఉన్నారు. గంజాయి ముఠా కార్యకలాపాలపై పక్కా సమాచారం అందడంతో.. ఖైరతాబాద్ విశ్వేశ్వరయ్య భవన్ దగ్గర తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులను చూసి ముఠాలోని యువకులు పారిపోయేందుకు ప్రయత్నించారు. దీంతో గమనించిన పోలీసులు యువకులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 1182 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. చిక్కడపల్లిలో గంజాయి కొనుగోలు చేసి చిన్న చిన్న ప్యాకెట్లుగా మార్చి అమ్ముతున్నట్లు పోలీసులు తెలిపారు.

Next Story