ఓటరు జాబితాపై అప్రమత్తంగా ఉండాలి : కేటీఆర్

by Ratna Kumari |   (  Updated:2026-05-17 14:43:27  IST  )

'నా బూత్- నా బాధ్యత' అనే నినాదంతో ఎల్‌బీనగర్ నియోజకవర్గ పరిధిలోని హస్తినాపురం డివిజన్‌లో గల జీఎస్ఆర్ హాల్‌లో నిర్వహించిన బీఎల్ఏ (Booth Level Agent)ల శిక్షణ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఓటరు జాబితాపై అప్రమత్తంగా ఉండాలి : కేటీఆర్
X

దిశ, వనస్థలిపురం : 'నా బూత్- నా బాధ్యత' అనే నినాదంతో ఎల్‌బీనగర్ నియోజకవర్గ పరిధిలోని హస్తినాపురం డివిజన్‌లో గల జీఎస్ఆర్ హాల్‌లో నిర్వహించిన బీఎల్ఏ (Booth Level Agent)ల శిక్షణ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో బీఎల్ఏల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. ఓటరు జాబితాను క్షుణ్ణంగా పరిశీలించడం, కొత్త ఓటర్ల నమోదు, డూప్లికేట్ పేర్ల తొలగింపు, తప్పుల సవరణ వంటి అంశాల్లో పార్టీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎన్నికల కమిషన్ చేపట్టే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమంలో చురుకుగా పాల్గొని ప్రతి అర్హుడైన ఓటరుకు న్యాయం జరిగేలా పని చేయాలని పిలుపునిచ్చారు. ఎల్బీన‌గ‌ర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వ‌హించిన ఈ కార్య‌క్ర‌మానికి మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, దేశపతి శ్రీనివాస్, రాగిడి లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Next Story