సికింద్రాబాద్ మహబూబ్ కాలేజీలో ‘వివేక సూర్యోదయ సప్తాహం’

by Ajay Maddhiboyina |

స్వామి వివేకానంద వాక్కు యావత్ ప్రపంచాన్ని కదిలించింది. భారతీయ ఆధ్యాత్మిక ఆత్మను విశ్వవ్యాప్తం చేసిన ఆ మహనీయుడు తొలిసారి భాగ్యనగరానికి వచ్చి ఈ ఏడాదితో 133 ఏండ్లు పూర్తికావొస్తున్నాయి.

సికింద్రాబాద్ మహబూబ్ కాలేజీలో ‘వివేక సూర్యోదయ సప్తాహం’
X

దిశ, వెబ్ డెస్క్: స్వామి వివేకానంద వాక్కు యావత్ ప్రపంచాన్ని కదిలించింది. భారతీయ ఆధ్యాత్మిక ఆత్మను విశ్వవ్యాప్తం చేసిన ఆ మహనీయుడు తొలిసారి భాగ్యనగరానికి వచ్చి ఈ ఏడాదితో 133 ఏండ్లు పూర్తికావొస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ రామకృష్ణ మఠం శాఖ ‘వివేక సూర్యోదయ సప్తాహం’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. 1893లో స్వామి వివేకానంద హైదరాబాద్‌లో జరిపిన చారిత్రక పర్యటనను గుర్తు చేసుకుంటూ సికింద్రాబాద్ మహబూబ్ కాలేజీలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

1893లో హైదరాబాద్‌కు స్వామి వివేకానందుడు వచ్చినప్పుడు, మహబూబ్ కాలేజీలో ఆయన ఇచ్చిన మొదటి పబ్లిక్ లెక్చర్ భారత ఉపఖండంలోనే ఆయన మొదటి ప్రసిద్ధ ఉపన్యాసంగా చరిత్రలో నిలిచింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని యువత, భక్తులు, సాధారణ ప్రజల కోసం ప్రేరణాత్మకమైన, ఉత్సాహవంతమైన కార్యక్రమాలను రామకృష్ణ మఠం నిర్వహిస్తోంది.

ఈ కార్యక్రమాలన్నీ కూడా సికింద్రాబాద్ మహబూబ్ కాలేజీ క్యాంపస్‌లోని వివేకానంద ఆడిటోరియంలో జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనవచ్చని మఠం అధ్యక్షులు స్వామి బోధమయానంద మహారాజ్ ప్రకటనలో తెలిపారు. మరిన్ని వివరాల కోసం రామకృష్ణ మఠం అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.

Next Story