వికారాబాద్ అభ్యర్థికి అన్యాయం జరిగిందంటూ నిరసన

by Sridhar Babu |   (  Updated:2023-10-03 18:17:51  IST  )

బహుజన్ సమాజ్ పార్టీ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం 20 మందితో కూడిన మొదటి లిస్టును విడుదల చేశారు.

వికారాబాద్ అభ్యర్థికి అన్యాయం జరిగిందంటూ నిరసన
X

దిశ,కార్వాన్ : బహుజన్ సమాజ్ పార్టీ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం 20 మందితో కూడిన మొదటి లిస్టును విడుదల చేశారు. కాగా వికారాబాద్ అభ్యర్థికి అన్యాయం జరిగిందంటూ బహుజన్ సమాజ్ పార్టీ కార్యాలయం ముందు వికారాబాద్ జిల్లా బహుజన సమాజ్ పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.వికారాబాద్ జిల్లా ఇంఛార్జి తలారి రాజుకి బదులుగా క్రాంతి కుమార్ కు టికెట్ ఇచ్చారని, పార్టీని నమ్ముకొని పని చేస్తున్నవారికి అన్యాయం చేశారని ఆరోపించారు.

Next Story