టీజీటీడీసీ ఎండీగా వల్లూరు క్రాంతి బాధ్యతల స్వీకరణ

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-06-16 16:03:15  IST  )

టీజీటీడీసీ ఎండీగా వల్లూరు క్రాంతి బాధ్యతల స్వీకరించారు...

టీజీటీడీసీ ఎండీగా వల్లూరు క్రాంతి బాధ్యతల స్వీకరణ
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ (టీజీటీడీసీ) మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ)గా వల్లూరు క్రాంతి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. పర్యాటక శాఖ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సమక్షంలో ఆమె పదవీ బాధ్యతలు చేపట్టారు. వల్లూరు క్రాంతి గతంలో సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా సమర్థవంతంగా విధులు నిర్వర్తించారు. ఆమె సుదీర్ఘ అనుభవం, పరిపాలనా దక్షత టీజీటీడీసీ అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుందని ఈ సందర్భంగా మంత్రి జూపల్లి ఆశాభావం వ్యక్తం చేశారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం వల్లూరు క్రాంతి మాట్లాడుతూ, తెలంగాణలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని తెలిపారు.

Next Story