'చదువుతో పాటు సాంస్కృతిక రంగంలో పాల్గొనాలి'

by Disha Web Desk 13 |
చదువుతో పాటు సాంస్కృతిక రంగంలో పాల్గొనాలి
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: విద్యార్థులు, యువకులు చదువుతో పాటు సాంస్కృతిక రంగంలో కూడా పాల్గొన్నప్పుడే దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ అన్నారు. బుధవారం బొగ్గులకుంటలోని తెలంగాణ సారస్వత పరిషత్ ఆడిటోరియంలో 'అభినయ సుధా కళా వారధి సాంస్కృతిక సేవా సంస్థ' పదవ వార్షికోత్సవం పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సంస్కృతిక కళాకారులకు, సంస్థలకు తెలంగాణ ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందన్నారు. జానపద కూచిపూడి భరతనాట్యం తదితర నృత్యాలకు కళా సంస్కృతిక సంస్థలు ప్రోత్సహించి కళారంగాన్ని ముందుకు తీసుకెళ్లాలని యువ కళాకారులకు పిలుపునిచ్చారు.

భారతీయ సత్యవాణి ప్రసంగిస్తూ.. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీనటి రోజా రమణి, జూపల్లి మంజుల రావు, మేజర్ డీ జయసుధ, డాక్టర్ రాజ్ నారాయణ ముదిరాజ్, డాక్టర్ చిన్మయి తమ్మారెడ్డి నాగార్జున, శ్రీధర్ తదితనేలే పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా పలువురికి సేవా రత్న పురస్కారాలు ప్రదానం చేశారు. అందుకున్న వారిలో మేజర్ సుప్రియ, డాక్టర్ రవితేజ, ఎన్ లక్ష్మి సామ్రాజ్యం, శ్రీ భక్తురామ్,డాక్టర్ ఐజాక్ రాజ్, ఈఎం సునీత, ఎన్ఎస్ కిరణ్ కుమార్, సాయి కుమార్, శ్రీనివాస్, అజయ్ సింగ్ రాజ్ పుత్, కెప్టెన్ డాక్టర్ టి.ఎస్ సింగ్ లను అవార్డు అవార్డులు అందుకున్నారు. కస్తూర్బా డిగ్రీ పీజీ కళాశాల విద్యార్థులు, సరోజినీ నాయుడు వనిత మహా విద్యాలయ విద్యార్థినులు, ప్రగతి మహా విద్యాలయం విద్యార్థిని విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని సంస్కృతి కార్యక్రమాలు నిర్వహించి ఆహుతులను అలరించారు.

READ MORE

ధరణి పోర్టల్ తక్షణమే రద్దు చేయాలి: పట్లోళ్ల సంజీవరెడ్డి డిమాండ్



Next Story