Uppal Flyover : దసరా నాటికి ఉప్పల్ ఫ్లైఓవర్ పూర్తి : మంత్రి క్లారిటీ

by Muthe.Rajitha |

దసరా(Dasara) నాటికల్లా ఉప్పల్ ఫ్లైఓవర్(Uppal Flyover) పూర్తవుతుందని రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Minister Komatireddy Venkata Reddy) క్లారిటీ ఇచ్చారు.

Uppal Flyover : దసరా నాటికి ఉప్పల్ ఫ్లైఓవర్ పూర్తి : మంత్రి క్లారిటీ
X

దిశ, వెబ్ డెస్క్ : దసరా(Dasara) నాటికల్లా ఉప్పల్ ఫ్లైఓవర్(Uppal Flyover) పూర్తవుతుందని రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Minister Komatireddy Venkata Reddy) క్లారిటీ ఇచ్చారు. బుధవారం మంత్రి కోమటిరెడ్డి ఉప్పల్ రింగ్ రోడ్ నుండి నారపల్లి వరకు 8 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న ఉప్పల్ ఫ్లైఓవర్ పనులను మేడిపల్లి వద్ద పరిశీలించారు. 9 సంవత్సరాలుగా ఆర్థిక సమస్యలతో ఆగిపోయిన ఈ పనులకు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త ఊపు తెచ్చిందన్నారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో చర్చలు జరిపి, పాత కాంట్రాక్టర్లను మార్చి పనులను వేగవంతం చేశామని పేర్కొన్నారు.

ఈ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయితే ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని అన్నారు. నగరంలో పివి ఎక్స్‌ప్రెస్ హైవే తర్వాత అతిపెద్ద ఫ్లైఓవర్‌గా ఇది నిలవనుందని తెలిపిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. దసరా నాటికి ఈ ఫ్లైఓవర్‌ను ప్రజల వినియోగానికి అందుబాటులోకి తేవడానికి ప్రయత్నం చేస్తున్నామని స్పష్టం చేసారు.

Next Story