తెలంగాణకు గుడ్ న్యూస్.. మరో కొత్త ఎయిర్‌పోర్టు ఏర్పాటుపై కేంద్రమంత్రి కీలక ప్రకటన

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-03-02 10:37:06  IST  )

తెలంగాణలో మరో కొత్త ఎయిర్ పోర్టుపై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన చేశారు...

తెలంగాణకు గుడ్ న్యూస్.. మరో కొత్త ఎయిర్‌పోర్టు ఏర్పాటుపై కేంద్రమంత్రి   కీలక ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: వరంగల్ మామూనూర్ ఎయిర్ పోర్టు(Warangal Mamoonur Airport) నిర్మాణానికి కేంద్రం ఓకే చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఆదివారం హైదరాబాద్ కవాడీగూడ(Hyderabad Kavadiguda)లో కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, రామ్మోహన్ నాయుడు(Union Ministers Kishan Reddy and Rammohan Naidu) మీడియాతో మాట్లాడారు. మోడీ ప్రధాని అయిన తర్వాత విమానయానరంగం(Aviation)లో విప్లవాత్మమైన మార్పులు తెచ్చారని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. వరంగల్ ఎయిర్ పోర్టు క్లియరెన్స్ ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. వరంగల్ ఎయిర్‌పోర్టు ప్రజల చిరకాల వాంఛ అని చెప్పారు. ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు తన హయాంలో క్లియరెన్స్ రావడం ఎంతో సంతోషనిచ్చిందన్నారు. గతంలోనే వరంగల్‌లో ఎయిర్‌పోర్టు ఉండేదని, అది అసియాలోనే అతి పెద్దదని రామ్మోహన్ నాయుడు గుర్తు చేశారు. 1981 వరకూ వరంగల్ ఎయిర్ పోర్టులో కార్యకలాపాలు సాగాయని తెలిపారు. మోడీ ప్రధాని కాక ముందు దేశంలో 79 ఎయిర్ పోర్టులు ఉండేవని.. ఇప్పుడు అవి 150కి పెరిగాయని తెలిపారు. చిన్న చిన్న నగరాల్లోనూ ఎయిర్‌పోర్టులను కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని రామ్మోహన్ నాయుడు వెల్లడించారు.

అయితే వరంగల్ ఎయిర్ పోర్టు విషయంలో ఆలస్యం జరిగిందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. మామునూరు ఎయిర్‌పోర్టు క్లియరెన్స్ విషయంలో చాలా సమస్య తలెత్తాయన్నారు. ఎయిర్ పోర్టుకు 2800 మీటర్ల రన్ వే కావాల్సి ఉంటుందని, ఇందుకోసం 280 ఎకరాలు అదనంగా భూసేరకరణ చేయాల్సి ఉంటుందని, ఇందుకోసం కేంద్రం నుంచి ప్రతిపాదనలు వచ్చాయని తెలిపారు. గత ప్రభుత్వం సహకరించలేదని.. అందువల్ల ఎయిర్ పోర్టు నిర్మాణం ఆలస్యమైందన్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు(Shamshabad Airport) నుంచి ఏన్ వోసీ కావాల్సి వచ్చిందని, ఇప్పుడు తీసుకుని మామూనూరు విమానాశ్రయానికి క్లియరెన్స్ ఇచ్చామని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం త్వరగా భూమిని సేకరిస్తే వెంటనే ఎయిర్ పోర్టు పనులు ప్రారంభవుతాయని చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం ఎయిర్ పోర్టు కోసం స్థలం కావాలని ప్రభుత్వానికి ఇప్పటికే ప్రతిపాదనలు పంపామన్నారు. గతంలో సూచించిన స్థలం ఫీజిబులిటీగా లేదని, మరోచోట స్థలం కావాలని ప్రతిపాదించినట్లుగా రామ్మోహన్ నాయుడు చెప్పారు. కొత్త స్థలం ఇస్తే ఫీజిబులిటీని పరిశీలిస్తామని తెలిపారు. రిపోర్టు సానుకూలంగా వస్తే భద్రాద్రి కొత్తగూడెంలో ఎయిర్ పోర్టు ఏర్పాటు చేసేందుకు కేంద్రం రెడీగా ఉందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.

Next Story