దిల్‌సుఖ్‌నగర్‌ సాయిబాబా గుడివద్ద నిరుద్యోగుల ధర్నా..

by Kodari Anjali |

పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు 5 వేల నుండి 20 వేలకు పెంచాలని నిరుద్యోగులు శుక్రవారం దిల్ సుఖ్ నగర్ లోని సాయిబాబా ఆలయం ముందు ధర్నా చేశారు.

దిల్‌సుఖ్‌నగర్‌ సాయిబాబా గుడివద్ద నిరుద్యోగుల ధర్నా..
X

దిశ, చైతన్యపురి: పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు 5 వేల నుండి 20 వేలకు పెంచాలని నిరుద్యోగులు శుక్రవారం దిల్ సుఖ్ నగర్ లోని సాయిబాబా ఆలయం ముందు ధర్నా చేశారు. పోలీస్ నియామకాలకు ఏజ్ లిమిట్ పై తక్షణమే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వంలో 45 వేల పోలీస్ ఉద్యోగాలు భర్తీ చేస్తే ఈ ప్రభుత్వం కేవలం 5 వేలు మాత్రమే చేస్తామని తెలపడంతో నిరసనగా ధర్నా చేస్తున్నట్లు నిరుద్యోగులు తెలిపారు. గత ప్రభుత్వంలో ఉన్న సడలింపులు ఇప్పుడు ఎందుకు తగ్గించారని నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకు, నిరుద్యోగ అభ్యర్థులకు మధ్య ఘర్షణ జరిగింది. మాకు న్యాయం చేయాలని నిరుద్యోగులు నినాదాలతో హోరెత్తించారు.

Next Story