రేపే ఉజ్జయిని మహంకాళి బోనాలు.. పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం రేవంత్ రెడ్డి

by Muthe.Rajitha |

సికింద్రాబాద్‌(Secunderabad)లోని ఉజ్జయిని మహంకాళి(Ujjain Mahakali) బోనాల జాతర జులై 13 నుండి 15 వరకు ఘనంగా జరగనుంది.

రేపే ఉజ్జయిని మహంకాళి బోనాలు.. పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్ : సికింద్రాబాద్‌(Secunderabad)లోని ఉజ్జయిని మహంకాళి(Ujjain Mahakali) బోనాల జాతర జులై 13 నుండి 15 వరకు ఘనంగా జరగనుంది. ఈ బోనాల జాతరలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. సోమవారం రంగం (భవిష్యవాణి) కార్యక్రమంతోపాటు అమ్మవారి అంబారీ (ఏనుగు ఊరేగింపు) కూడా జరగనుంది. లక్షలాది భక్తులు హాజరయ్యే ఈ ఆషాఢ మాస ఉత్సవంలో మహిళలు అమ్మవారికి బోనం (మట్టికుండలో వండిన అన్నం, బెల్లం, పసుపు, కుంకుమతో అలంకరించిన సమర్పణ) అర్పిస్తారు.

ఈ వేడుకలో భారీ రద్దీని నియంత్రించేందుకు ఆలయం చుట్టూ 2 కిమీ మేర ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. దాదాపు 1,600 మంది పోలీసులతో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. 70 సీసీటీవీ కెమెరాలతో నిరంతర నిఘా ఏర్పాట్లు చేసారు. ప్రతీ ఏటా ఈ జాతరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుండి ఇసుకవేస్తే రాలనంత మంది భక్తులు హాజరవుతారు.

Next Story