ఖజానా జ్యువెలరీ కేసులో మరో ఇద్దరు నిందితుల అరెస్ట్

by velandi.Saikiran |

ఖజానా జ్యువెలరీ షోరూంలో జరిగిన చోరీ కేసులో అంతర్-రాష్ట్ర దోపిడీ ముఠాలోని మరో ఇద్దరు సభ్యులను అరెస్టు చేశారు చందానగర్ పో

ఖజానా జ్యువెలరీ కేసులో మరో ఇద్దరు నిందితుల అరెస్ట్
X

దిశ, శేరిలింగంపల్లి: ఖజానా జ్యువెలరీ షోరూంలో జరిగిన చోరీ కేసులో అంతర్-రాష్ట్ర దోపిడీ ముఠాలోని మరో ఇద్దరు సభ్యులను అరెస్టు చేశారు చందానగర్ పోలీసులు. గత వారం ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు.. తాజాగా ఈ కేసులో బుధవారం మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. బీహార్ కు చెందిన అనిష్ కుమార్ సింగ్, ప్రిన్స్ కుమార్ రాజక్ లను పూణేలోని పింప్రి, చకన్‌ లో అదుపులోకి తీసుకున్నట్లు మాదాపూర్ డీసీపీ కార్యాలయం నుండి ఒక ప్రకటన విడుదల చేశారు. నిందితుల వద్ద నుంచి ఒక తుపాకీ (పిస్టల్), 1,015 గ్రాముల దొంగిలించబడిన బంగారు రంగు వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. కేసుకు సంబంధించిన ఇతర నిందితులను పట్టుకోవడానికి, మిగిలిన ఆస్తిని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.

Next Story