ఆంధ్ర మహిళా సభలో ఘనంగా ప్రారంభమైన రెండు రోజుల స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమం

by Kodari Anjali |

ఉపాధి నైపుణ్యాలను మెరుగుపరచే లక్ష్యంతో ఆంధ్ర మహిళా సభ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఫర్ ఉమెన్‌లో రెండు రోజుల ఉద్యోగ నైపుణ్యాల శిక్షణ కార్యక్రమంను సోమవారం ఘనంగా ప్రారంభించారు.

ఆంధ్ర మహిళా సభలో ఘనంగా ప్రారంభమైన రెండు రోజుల స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమం
X

దిశ, సికింద్రాబాద్: విద్యార్థినుల్లో ఉద్యోగ అవకాశాలపై అవగాహన పెంపొందించి, ఉపాధి నైపుణ్యాలను మెరుగుపరచే లక్ష్యంతో ఆంధ్ర మహిళా సభ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఫర్ ఉమెన్‌లో రెండు రోజుల ఉద్యోగ నైపుణ్యాల శిక్షణ కార్యక్రమంను సోమవారం ఘనంగా ప్రారంభించారు. కళాశాల ఐక్యూఏసీ, ప్లేస్‌మెంట్ సెల్ ఆధ్వర్యంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం యూనివర్సిటీ ఎంప్లాయ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ గైడెన్స్ బ్యూరో, మోడల్ కెరీర్ సెంటర్, నిర్మాణ్ సంస్థల సహకారంతో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా యూఈఐజీబీ చీఫ్ డా. జి. దుర్గేశం, డిప్యూటీ చీఫ్ టి. రాము విద్యార్థినులకు ఉద్యోగ అవకాశాలు, వ్యక్తిత్వ వికాసం, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, ఇంటర్వ్యూ పద్ధతులు, కెరీర్ ప్రణాళిక వంటి అంశాలపై మార్గనిర్దేశం చేశారు. నేటి పోటీ ప్రపంచంలో సాంకేతిక, వ్యక్తిగత నైపుణ్యాలను పెంపొందించుకోవడం ద్వారా మెరుగైన ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని సూచించారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి కెరీర్ లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో సుమారు 250 మంది విద్యార్థినులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. కరుణా దేవి, వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ వై. వసుంధర, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ ఎ. ప్రమీల, ప్లేస్‌మెంట్ సెల్ కన్వీనర్ వి. రాధిక తదితరులు పాల్గొన్నారు.

Next Story