- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సాయికృష్ణ ఘటన వెనుక ఆయనే: మాజీ మంత్రి అంబటి
విజయవాడ కృష్ణలంక సాయికృష్ణ వ్యవహారం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. సాయికృష్ణను మార్కాపురం నుంచి కృష్ణలంకకు టాస్క్ ఫోర్స్ తీసుకొచ్చింది విజయవాడ పోలీస్ కమిషనర్ ప్రమేయంతోనేనని ఆయన చెప్పారు.....

దిశ, వెబ్ డెస్క్: విజయవాడ కృష్ణలంక సాయికృష్ణ(Vijayawada Krishnalanka Saikrishna ) వ్యవహారం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని మాజీ మంత్రి అంబటి రాంబాబు(Former Minsiter Ambati Rambabu) అన్నారు. సాయికృష్ణను మార్కాపురం నుంచి కృష్ణలంకకు టాస్క్ ఫోర్స్ తీసుకొచ్చింది విజయవాడ పోలీస్ కమిషనర్ ప్రమేయంతోనేనని ఆయన చెప్పారు. సోషల్ మీడియాలో చెబుతున్నట్టు సాయికృష్ణపై చాలా కేసులు లేవని, రెండు కేసులే ఉన్నాయన్నారు. నాన్-బెయిల్ వారెంట్ ఉంటే కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి కానీ ఈ వ్యవహారంలోకి టాస్క్ ఫోర్స్ ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. సాయికృష్ణను స్టేషన్‌కు తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టి చంపేశారని అంబటి ఆరోపించారు. ఇప్పుడేమో విచారణ అంటూ రోజుకో కథ అల్లుతున్నారని విమర్శించారు. విజయవాడ సీపీనే ఈ కేసుకు బాధ్యత వహించాలని, ఆ తర్వాతే సీఐ నాగరాజు అని మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.






