ఆన్ లైన్ ట్రెండింగ్ పేరుతో రూ.1.24 కోట్లు కొల్ల‌గొట్టిన ఇద్ద‌రు నిందితులు అరెస్ట్

by Ratna Kumari |

ఆన్ లైన్ ట్రెండింగ్ పేరుతో రూ.1.24 కోట్ల‌ను కొల్ల‌గొట్టిన ఇద్ద‌రు నిందితులు అరెస్ట్ అయ్యారు. సైబ‌ర్ క్రైమ్ పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. ఈ కేటుగాళ్లు తొలుత వాట్సాప్, టెలిగ్రామ్, న‌కిలీ ట్రేడింగ్ వెబ్ సైట్ ద్వారా బాధితుల‌ను సంప్ర‌దిస్తారు

ఆన్ లైన్ ట్రెండింగ్ పేరుతో రూ.1.24 కోట్లు కొల్ల‌గొట్టిన ఇద్ద‌రు నిందితులు అరెస్ట్
X

దిశ‌, శేరిలింగంప‌ల్లి : ఆన్ లైన్ ట్రెండింగ్ పేరుతో రూ.1.24 కోట్ల‌ను కొల్ల‌గొట్టిన ఇద్ద‌రు నిందితులు అరెస్ట్ అయ్యారు. సైబ‌ర్ క్రైమ్ పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. ఈ కేటుగాళ్లు తొలుత వాట్సాప్, టెలిగ్రామ్, న‌కిలీ ట్రేడింగ్ వెబ్ సైట్ ద్వారా బాధితుల‌ను సంప్ర‌దిస్తారు. న‌మ్మ‌కం క‌లిగించే వ‌ర‌కు వారితో చాట్ చేసి ఆ త‌రువాత అధిక లాభాలు వ‌స్తాయ‌ని ఆశ చూపి ట్రేడింగ్ పేరుతో రూ.1.26 కోట్లు కొల్ల‌గొట్టారు. బాధితులు సైబ‌ర్ క్రైమ్ పోలీసులు ఆశ్ర‌యించ‌డంతో కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు ప్రారంభించారు. భారీ ఆన్ లైన్ సైబ‌ర్ మోసాన్ని ఛేదించారు. మోసగాళ్లు టెలిగ్రామ్, వాట్సాప్ ద్వారా బాధితుడిని సంప్రదించి.. అధిక రాబడులు వస్తాయని నమ్మిస్తారు. నకిలీ ఏఐ-ఆధారిత ఆన్‌లైన్ ట్రేడింగ్, ఐపిఓ పెట్టుబడి ప్లాట్ ఫారమ్‌లో చేరమని, ట్రేడింగ్ చిట్కాలు చెప్పి మరింత నమ్మిస్తారు. నకిలీ లాభాల వచ్చినట్లు నకిలీ స్క్రీన్ షాట్‌లను పంపిస్తారు. నకిలీ ట్రేడింగ్ వెబ్‌సైట్‌లో ఖాతా తెరిచి, IMPS/NEFT/RTGS ద్వారా పలు బ్యాంకు ఖాతాలకు డబ్బు బదిలీ చేయమని బాధితుడికి సూచించారు. ఆ నకిలీ ప్లాట్‌ఫారమ్ భారీ మొత్తంలో వర్చువల్ లాభాలను ప్రదర్శించి.. మరింత డబ్బు పెట్టుబడి పెట్టేలా బాధితుడిని ఒప్పిస్తారు. నిందితులు మోసపూరితంగా కాజేసిన మొత్తాన్ని పలు మ్యూల్ బ్యాంకు ఖాతాలకు మళ్లిస్తారు. బాధితుడు ఆ డబ్బు విత్‌డ్రా చేయడానికి ప్రయత్నించినప్పుడు, మోసగాళ్లు అదనంగా చెల్లించాలని డిమాండ్ చేస్తారు. ఇలా మోసం చేసి కోట్లు కాజేసిన ఇద్దరు నిందితులు ఉమేష్ చౌవాన్, రాథోడ్ దశరథ్ లను అరెస్టు చేసినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు.

Next Story