- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీఏఆర్ కానిస్టేబుల్‌కు TSHRC చైర్‌పర్సన్ ప్రశంస.. కారణం ఏంటంటే?
ఇటీవల కురిసిన భారీ వర్షాల సమయంలో ఓ యువతిని రక్షించి, సురక్షితంగా ఇంటికి చేర్చిన హైదరాబాద్ సిటీ ఆర్మ్డ్ రిజర్వ్ ( సీఏఆర్ ) హెడ్ కానిస్టేబుల్ శ్రీధర్ వర్మను తెలంగాణ మానవ హక్కుల కమిషన్( టీఎస్‌హెచ్‌ఆర్‌సీ ) చైర్‌పర్సన్

దిశ, హైదరాబాద్ బ్యూరో: ఇటీవల కురిసిన భారీ వర్షాల సమయంలో ఓ యువతిని రక్షించి, సురక్షితంగా ఇంటికి చేర్చిన హైదరాబాద్ సిటీ ఆర్మ్డ్ రిజర్వ్ ( సీఏఆర్ ) హెడ్ కానిస్టేబుల్ శ్రీధర్ వర్మను తెలంగాణ మానవ హక్కుల కమిషన్( టీఎస్‌హెచ్‌ఆర్‌సీ ) చైర్‌పర్సన్, డా. జస్టిస్ షమీమ్ అఖ్తర్ ప్రత్యేకంగా అభినందించారు. ఈనెల 4వ తేదీ సాయంత్రం హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షాల కారణంగా బంజారాహిల్స్ రహదారులు నడుము లోతు వరద నీటిలో మునిగిపోయాయి. ఈ పరిస్థితుల్లో టీఎస్‌హెచ్‌ఆర్‌సీ చైర్‌పర్సన్ భద్రతా బృందంలో పైలట్-కమ్-ఎస్కార్ట్ సిబ్బందిగా విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ శ్రీధర్ వర్మ రోడ్ నెం.3వద్ద బస్టాప్‌లో ఒంటరిగా నిలబడి భయాందోళనలకు లోనైన 22 ఏళ్ల యువతి నైనికను గమనించారు.
ఆస్ట్రేలియాలో ఎంబీఏ చదువుకుంటూ రామంతపూర్‌లో కుటుంబ సభ్యులను కలుసుకోవడానికి వచ్చిన నైనిక, వరదలో ఇరుక్కుపోయింది. నీటి భయం(హైడ్రోఫోబియా)తో విలవిలలాడుతూ, మొబైల్ ఫోన్ పనిచేయకపోవడంతో తల్లిదండ్రులను సంప్రదించ లేకపోయింది. ఈ సమయంలో హెడ్ కానిస్టేబుల్ శ్రీధర్, ఆమె వద్దకు వెళ్లి తన జెర్కిన్ ఇవ్వడంతో పాటు ధైర్యం చెప్పి, ఆమె కుటుంబ సభ్యులను సమాచారం అందించారు. ప్రయాణ సౌకర్యాలు లభించకపోవడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు, ఆయన స్వయంగా నైనికను వానలతో ముంచెత్తిన రహదారులను దాటుతూ వనస్థలిపురంలోని ఆమె ఇంటికి తీసుకెళ్లి బాధిత యువతి తల్లి, చెల్లెలు వద్దకు క్షేమంగా చేర్చారు.
ఈ సంఘటన వార్త పత్రికలు, సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం జరిగింది. దీనిపై (టీఎస్‌హెచ్‌ఆర్‌సీ) చైర్మెన్ డా.జస్టిస్ షమీమ్ అఖ్తర్ హెడ్ కానిస్టేబుల్ శ్రీధర్ వర్మ సేవను, విధి నిర్వహణకు మించి మానవత్వం, కర్తవ్య బాధ్యతను ప్రత్యేకంగా అభినందించారు. ఆయన చూపిన నిస్వార్థ సేవ, బాధలో ఉన్న యువతి సురక్షితత్వం, గౌరవాన్ని కాపాడడమే కాకుండా, పోలీసింగ్, మానవ హక్కుల పరిరక్షణలోని అసలు స్ఫూర్తిని ప్రతిబింబిస్తుందని చైర్‌పర్సన్ షమీమ్ కానిస్టేబుల్ శ్రీధర్ వర్మను అభినందించారు. అలాగే ప్రశంసాపత్రాన్ని అందజేశారు.






