- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గాయని మంగ్లీకి మద్దతుగా గిరిజన సంఘాలు
ప్రముఖ గాయని మంగ్లీ పై వస్తున్న అసత్య ఆరోపణలను గిరిజన సంఘాలు తీవ్రంగా ఖండించాయి.

దిశ, సికింద్రాబాద్ : ప్రముఖ గాయని మంగ్లీ పై వస్తున్న అసత్య ఆరోపణలను గిరిజన సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో నిర్వహించిన మీడియా సమావేశంలో గిరిజన సంఘాల నాయకులు ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా నాయకులు శరత్ నాయక్, అశోక్ నాయక్, సుబ్బు నాయక్, విజయేందర్ నాయక్ మాట్లాడుతూ మంగ్లీ పై సంబంధం లేని కేసులో ఇరికించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. ఆమె పరువు ప్రతిష్టలను దెబ్బతీయడానికి కుట్ర జరుగుతోందని పేర్కొన్నారు. అమాయక ప్రజలను అధిక వడ్డీ పేరుతో మోసం చేసి కోట్ల రూపాయలు వసూలు చేసిన సూత్రధారులైన రమావత్ మధు, హేమాకాంత్ రెడ్డి పై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం చేయాలని కోరారు. మారుమూల తండా నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన మంగ్లీ పై ఓర్వలేక నిరాధార ఆరోపణలు చేస్తున్నారని, ఇలాంటి చర్యలు సిగ్గుచేటని విమర్శించారు. బాధితుల పక్షాన నిలబడి వారికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని గిరిజన సంఘాల నాయకులు స్పష్టం చేశారు.






