సాగర్ ​రింగ్ ​రోడ్డు చింతలకుంట వరకు ట్రాఫిక్‌ అవస్థలు

by velandi.Saikiran |

ఎల్బీనగర్​ పరిధిలోని సాగర్ రింగ్ రోడ్ నుంచి వనస్థలిపురం వైపు వెళ్లే చింతలకుంట అండర్‌పాస్‌ను తాత్కాలికంగా మూసివేశారు.

సాగర్ ​రింగ్ ​రోడ్డు చింతలకుంట వరకు ట్రాఫిక్‌ అవస్థలు
X

రిపేర్లు.. తిప్పలు

l చింతలకుంట అండర్‌పాస్ బంద్..

l సాగర్ ​రింగ్ ​రోడ్డు చింతలకుంట వరకు ట్రాఫిక్‌ అవస్థలు

l ఎల్బీనగర్ వైపు తిరిగి..​ చుట్టూ 2 కిలోమీటర్లు రాకపోకలు

l పర్యవేక్షణ లోపం.. కాంట్రాక్టర్ ఇష్టా రాజ్యం

ఎల్బీనగర్​ పరిధిలోని సాగర్ రింగ్ రోడ్ నుంచి వనస్థలిపురం వైపు వెళ్లే చింతలకుంట అండర్‌పాస్‌ను తాత్కాలికంగా మూసివేశారు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అండర్‌పాస్ బంద్ చేయడంతో ప్రయాణికులు ఎల్బీనగర్ వరకు వెళ్లి యూ-టర్న్ తీసుకోవాల్సి వస్తుండడంతో సుమారు 2 కిలోమీటర్ల పైగా అదనంగా ప్రయాణించాల్సి వస్తోంది. అండర్​ పాస్​ నిర్మాణ సమయంలోనే వాటర్​ లెవల్స్​ సరిగా లేకపోవడంతో గతంలో వర్షం పడిన ప్రతిసారీ నీరు నిలుస్తుంది. దీంతో అండర్ పాస్​ నిండి వాహనదారులు ఇబ్బందులు పడేవారు.

దిశ, వనస్థలిపురం: వర్షం పడినప్పుడు అండర్‌పాస్‌లో నీరు చేరి బయటకు వెళ్లకపోవడం, నీరు బయటకు వెళ్లే పైప్ ​లైన్​ సరిగ్గా లేకపోవడంతో.. నీరు ఒకేచోట నిలిచిపోవడంతో మరమ్మతులు చేస్తున్న ట్లు తెలుస్తోంది. దానికి తోడు చింతలకుంట శక్తినగర్, జహంగీర్​ నగర్​ కాలనీల నుంచి డ్రైనేజ్ పైప్ ​లైన్లు కూడా అండర్​ పాస్​ నుంచి ఉండ డం, డ్రైనేజీ నీరు నిల్వడంతో తరు చూ రోడ్డు పాడైపోవడంతో రాబో యే వర్షాకాలం నేపథ్యంలో అధికారులు మరమ్మతులు చేపట్టినట్లు తెలి పారు. ఈ అండర్​ పాస్​ కారణంగా గతంలో చింతల కుంట వద్ద పనా మా గోడౌన్స్​ వరకు వరద జామ్​ అయి ఇబ్బందులు తలెత్తిన సందర్భాలున్నాయి. ఈ నేపథ్యంలో మరమ్మతుల కోసం అధికారులు తాత్కాలికంగా మూసివేసినట్లు తెలుస్తోం ది. పనులు పూర్తయ్యే వరకు ట్రాఫిక్‌ ను మళ్లించడంతో రద్దీ సమయాల్లో సమస్యలు పెరుగుతున్నాయి.

ఎలాంటి బోర్డులు డిస్​ ప్లే చేయని అధికారులు

రిపేర్లపై సంబంధిత అధికారులు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో కనీసం బల్దియా బోర్డులు ఏర్పాటు చేయకపోవడం తో వాహనదారుల్లో గందరగోళం నెలకొంది. రోజువారీగా ఈ మా ర్గాన్ని ఉపయోగించే ఉద్యోగులు, వి ద్యార్థులు ఎక్కువ సమయం, ఇంధ నం వృథా అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ట్రా ఫిక్ ఎక్కువగా ఉండే సమయాల్లో ఎల్బీనగర్ వద్ద రద్దీ పెరిగి ప్రయా ణం మరింత ఆలస్యం అవుతోందని వాపోతున్నారు. దీనికితోడు మ్యాప్​ లొకేషన్​ పెట్టుకొని వచ్చే వాహనదారులకు చింతలకుంట చెక్​ పోస్ట్​ నుంచి జహంగీర్​ నగర్​ అపోజిట్​లో చూపుతుండడంతో మెడిసిటీ హాస్పిటల్​ వైపు చూపుతుండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఏపీ నుంచి ఎల్బీనగర్​ వరకు వచ్చే ప్రైవేట్​ ట్రావెల్స్​ బస్సులు చింతల కుంట అండర్​ పాస్​ మూసివేయడంతో రాత్రి 12 దాటితే జామ్​ తో చింతలకుంట చెక్​ పోస్ట్​ ట్రాఫిక్​ తో నిండిపోతుంది. దీంతో రాత్రి వేళ వాహనదారులు తీవ్ర ఇబ్బందు లు పడుతున్నారు. అండర్‌పాస్‌ను త్వరగా మరమ్మతులు పూర్తి చేసి తిరిగి ప్రారంభించాలని వాహనదారులు, స్థానికులు కోరుతున్నారు.

Next Story