- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేస్తుంది : మహేష్ కుమార్ గౌడ్
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ వస్తుందని మతం, కులం పేరిట రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నాలు జరుగుతున్నాయని టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.

ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. దేశంలో ప్రస్తుతం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా ఫాసిస్ట్ శైలిలో పాలన కొనసాగుతుందన్నారు. ఆపరేషన్ కగారు పేరుతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలను తాము ముక్తకంఠంతో ఖండిస్తున్నామన్నారు. ఇది శాంతి రాజ్యాంగం పట్ల విధ్వంసకర చర్యగా భావిస్తున్నామన్నారు. మావోయిస్టులు చర్చలకు సిద్ధమని ప్రకటించిన చలించని ప్రధాని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మొట్టికాయలు వేస్తే మాత్రం ఉగ్రవాదులతో చర్చలకు సిద్ధమయ్యారని అన్నారు. పాకిస్తాన్లో కాల్పులు విరమణకు ముందుకు వచ్చిన కేంద్ర ప్రభుత్వం మన దేశ పౌరులైన మావోయిస్టులతో చర్చలు జరపకుండా మారణహోమం ఎందుకు చేస్తుందని ప్రశ్నించారు.
ప్రభుత్వాలు రాజ్యాంగానికి లోబడి వ్యవహరించాలనదే ప్రజాస్వామ్యానికి మౌలిక సూత్రం అన్నారు. కాంగ్రెస్ పార్టీ అహింస పునాదులపై నిర్మితమైందన్నారు. హింస ఎవరు నుంచైనా వస్తే దాన్ని తము తీవ్రంగా ఖండిస్తామన్నారు.అదేవిధంగా ఇలాంటి పరిస్థితుల్లో లౌకికవాద శక్తులు ఏకమవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కలిసి ఉద్యమించవలసిన సమయం ఆసన్నమైంది దీంతోకేంద్రంలోని ఫాసిస్టు పాలనకు తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.ఈ సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ , ప్రొఫెసర్ హరగోపాల్,విమలక్క,ఆర్ఎస్పీ రాష్ట్ర కార్యదర్శి జానకి రాములు, గడ్డం లక్ష్మణ్, జీవన్ కుమార్, లక్ష్మణ్, కృష్ణ ప్రసాద్,అన్వర్ ఖాన్, సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.






