హైదరాబాద్‌లో ఘోరం.. టీపీసీసీ చీఫ్ తీవ్ర విచారం

by Vemula.Srinu Prasad |

హైదరాబాద్ చార్మినార్‌ ప్రాంతంలో జరిగిన ఘోరంపై టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు...

హైదరాబాద్‌లో ఘోరం.. టీపీసీసీ చీఫ్ తీవ్ర విచారం
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ చార్మినార్‌(Charminar) ప్రాంతంలో జరిగిన ఘోరంపై టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్(TPCC Chief, MLC Mahesh Kumar Goud) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదం(Gulzar House Fire)లో 17 మంది మృతి చెందగా పలువురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఈ ఘటనపై మహేశ్ కుమార్ గౌడ్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పారు. అగ్ని ప్రమాదంలో 17 మృతి చెందడం బాధాకరమని మహేశ్ కుమార్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఇక అగ్ని ప్రమాదంపై హైదరాబాద్(Hyderabad) కాంగ్రెస్ నాయకులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాద స్థలంలో సహాయ సహకారాలు అందించాలని సూచించారు.

Next Story