సేఫ్ హైదరాబాద్ దిశగా.. జీరో డిలే పోలీసీంగ్ కు శ్రీకారం

by Ratna Kumari |

దిశ, సిటీక్రైం : నేరస్థులకు సరిహద్దులు లేనప్పుడు పోలీసులకు ఎందుకు ఈ నేపధ్యంలోనే హైదరాబాద్ మహానగరం

సేఫ్ హైదరాబాద్ దిశగా.. జీరో డిలే పోలీసీంగ్ కు శ్రీకారం
X

దిశ, సిటీక్రైం : నేరస్థులకు సరిహద్దులు లేనప్పుడు పోలీసులకు ఎందుకు ఈ నేపధ్యంలోనే హైదరాబాద్ మహానగరం పౌరులకు ఎటువంటి ఆలస్యం లేకుండా పోలీసు సేవలను అందించేందుకు ట్రై పోలీసు కమిషనరేట్ పోలీసు బాసులు సరికొత్త గా జీరో డిలే పోలీసీంగ్ విధానానికి అందించేందుకు శ్రీకారం చుట్టారు. హైదరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ సారధ్యంలో సైబరాబాద్ పోలీసు కమిషనర్ అవినాష్ మహంతి, రాచకొండ పోలీసు కమిషనర్ సుధీర్ బాబు లు ఇతర పోలీసు ఉన్నతాధికారులతో బుధవారం బంజారాహిల్స్ ఐసీసీసీ భవనంలో కీలక సమన్వయ సమావేశం నిర్వహించారు. జీరో డిలే విధానంతో సేఫ్ హైదరాబాద్ ప్రతిష్టను పెంచేవిధంగా అందరూ కలిసిపని చేయాలని నిర్ణయించుకున్నారు. నేర నియంత్రణతో పాటు క్రిమినల్స్ పై నిఘా, ట్రాఫిక్ సమస్యలు ఇంకా ఇతర అసాంఘిక కార్యకలపాలను అణిచివేసేందుకు ఈ విధానం ద్వారా కృషి చేద్దామని పోలీసులు డిసైడ్ అయ్యారు.

సరిహద్దుల పేరుతో నిర్లక్ష్యం చేయొద్దు : సజ్జనార్

పరిధుల పేరుతో ప్రజలకు పోలీసు సేవలను అందించడంలో నిర్లక్ష్యం చేయొద్దు.సమన్వయ లోపం లేకుండా పోలీసు సేవలను వేగంగా అందించాలి. క్రిమినల్స్ పై ట్రై పోలీసు కమిషనరేట్ పరిధిలోని పోలీసుల నిఘా ఉండాలి. ఇంటలిజెన్స్ సమాచారాన్ని పంచుకోవాలి. మూడు పోలీసు కమిషనరేట్ పరిధిలో నో ఎంట్రీ సమాయాలు ఒకే విధంగా ఉండాలి. రద్దీ సమయాల్లో భారీ వాహనాలు, ప్రైవేటు బస్సుల రాకపోకలను శివారు ప్రాంతాల్లోనే ఉండేలా చూసేందుకు ప్రణాళికలను రూపొందించుకోవాలి.

సీసీ టీవీ నెట్ వర్క్ ను అనుసంధానం చేసుకోవాలి : అవినాష్ మహంతి

నేరాల కట్టడికి మూడు పోలీసు కమిషనరేట్ పరిధిలోని సీసీ టీవీల నెట్ వర్క్ ను అనుసంధానం చేయాలి. దీంతో రియల్ టైంలో నేరస్థుల కదలికలను పసిగట్టి వారి కార్యకలాపాలకు చెక్ పెడతాం.ముఖ్యంగా ఐటీ కారిడార్, ఫైనాన్సియల్ డిస్ట్రిక్ వంటి కారిడార్ లలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ట్రై పోలీసు కమిషనరేట్ పోలీసు అధికారుల సమన్వయం అత్యవసరం. సరిహద్దు జంక్షన్ ల వద్ద సిగ్నల్ టైమింగ్స్ ఒకేలా ఉండేలా చూడాలి. ట్రై పోలీసు కమిషనరేట్ పరిధిలలో ఏకకాలంలో డ్రంకన్ డ్రైవింగ్ తనిఖీలు చేపట్టాలి.

నేరస్థుల భరతం పట్టేందుకు జాయింట్ టీమ్స్ ఏర్పాటు : సుధీర్ బాబు

నేరస్థుల కదలికలు, వారి వ్యవహారాలపై పట్టు సాధించేందుకు జాయింట్ టీమ్స్ ను ఏర్పాటు చేసి నిరంతర పర్యవేక్షణ ఉండాలి. గంజాయి, డ్రగ్స్ ఇతర అసాంఘిక కార్యకలపాలను అరికట్టేందుకు మూడు కమిషనరేట్ పరిధిలోని అధికారుల మధ్య సమాచారం షేర్ చేసుకోవాలి. ట్రై పోలీసు కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు ఒకే విధంగా నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలి. పెండింగ్ చలాన్ ల వసూలు కోసం మూడు పోలీసు కమిషనరేట్ పరిధిలో ఏకకాలంలో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు చేపట్టాలి. ఈ సమన్వయ సమావేశంలో అదనపు సీపీ శ్రీనివాసులు, జాయింట్ సీపీలు తఫ్సీర్ ఇక్బాల్, జోయల్ డెవిస్, గజరావు భూపాల్ తో పాటు మూడు పోలీసు కమిషనరేట్ పరిధిలోని డీసీపీ లు పాల్గొన్నారు.

Next Story