పోలీస్ బాబు "రిచ్ ప్రాపర్టీస్ " కహానీ..

by Bhanu |   (  Updated:2025-05-22 13:44:41  IST  )

గ్రేటర్ హైదరాబాద్ నగరం లోని కార్పొరేట్ రంగానికి ప్రసిద్ధి చెందిన పోలీస్ కమిషనరేట్ లోని ఓ జోన్ కు చెందిన హైయెస్ట్ ర్యాంక్ ఆఫీసర్ దుబాయ్ లో 50 లక్షల దినామ్స్ తో ఆస్తులు కొనుగోలు చేయాలని చేస్తున్న ప్రయత్నం పోలీస్ వర్గాల్లో లీక్ అయ్యి ఓ సెన్సేషన్ టాక్ అయ్యింది..

పోలీస్ బాబు రిచ్ ప్రాపర్టీస్  కహానీ..
X

దిశ, సిటీక్రైం : గ్రేటర్ హైదరాబాద్ నగరం లోని కార్పొరేట్ రంగానికి ప్రసిద్ధి చెందిన పోలీస్ కమిషనరేట్ లోని ఓ జోన్ కు చెందిన హైయెస్ట్ ర్యాంక్ ఆఫీసర్ దుబాయ్ లో 50 లక్షల దినామ్స్ తో ఆస్తులు కొనుగోలు చేయాలని చేస్తున్న ప్రయత్నం పోలీస్ వర్గాల్లో లీక్ అయ్యి ఓ సెన్సేషన్ టాక్ అయ్యింది.. దీంతో ఇప్పుడు ఈ శ్రీమంతుడైనా ఆఫీసర్ గురించి పోలీస్ వర్గాల్లో ఫుల్ చర్చ నడుస్తోంది. ఇదే కాకుండా ఈ ఆఫీసర్ హైదరాబాద్ మాదాపూర్, గచ్చిబౌలి, ఇంకా ఇతర ఖరీదైనా ప్రాంతాల్లో దాదాపు 8 నుంచి 10 కోట్లు విలువ చేసే ప్రాపర్టీ ని కొనుగోలు చేసేందుకు తిరిగాడని పోలీస్ వర్గాల్లో టాక్ తో సెన్సేషన్ అయ్యింది. అంతేకాకుండా ఈ పోలీసు కమీషనరట్ కు ఆనుకుని ఉండే జిల్లా లో ని ఓ గ్రామంలో తన దగ్గర పనిచేసే నమ్మకమైన బంధువు పేరు మీద 2 ఎకరాలకు పై గా వ్యవసాయ భూమి కొన్నట్లు పోలీసు వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. పక్క రాష్ట్రం లో కోట్లు విలువ చేసే ఓ ప్లాట్ ను కూడా కొన్నట్లు పోలీస్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. అయ్యితే ఈ ఆఫీసర్ ఆస్తుల చిట్టా పోలీస్ గ్రూప్ లలో చర్చగా మారి వైరల్ అవుతుంది.


జోన్ హైయెస్ట్ ర్యాంక్ ఆఫీసర్ కొంత మంది పొలిటికల్ దోస్తితో చేసే నిబంధనలకు విరుద్ధంగా, ఏకపక్షంగా ఒక వైపు సపోర్ట్ చేస్తు ల్యాండ్ సెటిల్మెంట్ లలో కీలకంగా వ్యవహారిస్తుండడం తో ఆ ఖదర్ బడాబాబులు ఇచ్చిన నజరానాలతో ఈ ఆఫీసర్ దగ్గర కరెన్సీ కట్టలు గుట్టలుగా పరిగెడుతు వస్తున్నాయి. వాటిని తగ్గిం చేందుకు చేస్తున్న ప్రయత్నం లో ఆస్తులను కొనుగోలు చేసేందుకు ప్రైమ్ లొకేషన్స్ లో తిరుగుతుండడం, ఆస్తుల పై అధికంగా చర్చించడం ఆ సీక్రెట్స్ పోలీస్ వర్గాల్లో అందరికి తెలిసిపోయి వాట్సాప్ లో చక్కర్లు కొడుతు ఆ తర్వాత డిలీట్ అయ్యిపోతున్నాయి. తన ఆస్తుల పై ప్రచారం జరిగి విచారణ జరిగితే లెక్కలను కన్ఫ్యూస్ చేసేందుకు ఓ కంపెనీని కూడా వారి బంధువుల పేరు మీద రిజిస్టర్ చేసినట్లు తెలిసింది. పోలీస్ వర్గాల్లో ఇప్పుడు ఆ కంపెనీ సిఐఎన్ నెంబర్ గురించి కూడా పోలీస్ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. తాజా గా సౌత్ ఆఫ్రికా లోని నమిబియా దేశం లో కొంత మంది వ్యాపారుల తో కలిసి బంగారం గనుల వ్యాపారం చేసేందుకు ఈ ఆఫీసర్ ఆరా తీసినట్లు పోలీస్ వర్గాల్లో బ్రేకింగ్ న్యూస్ గా వైరల్ అవుతుంది..అతి స్వల్ప వ్యవధిలో రిచ్ ఆఫీసర్ గా ముద్ర వేసుకున్న ఈ పోలీస్ ఆఫీసర్ అక్రమాస్థుల చిట్టా ఏప్పుడు, ఎలా, బయట పడుతుంది, ఏలాంటి చర్యలు ఉంటాయని పోలీస్ వర్గాల్లోనే అత్యధిక అధికారులు ఆసక్తి గా ఎదురు చూస్తున్నారాని సమాచారం.

Next Story