- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హత్య కేసును ఛేదించిన టోలిచౌకి పోలీసులు
దిశ, కార్వాన్ : హత్య కేసును ఛేదించిన ఘటన టోలి చౌకీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఏసీపీ సయ్యద్ ఫయాజ్ మీడియా

దిశ, కార్వాన్ : హత్య కేసును ఛేదించిన ఘటన టోలి చౌకీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఏసీపీ సయ్యద్ ఫయాజ్ మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. గోల్కొండ ప్రాంతానికి చెందిన షేక్ బిలాల్ ఆటో డ్రైవర్ గా పని చేస్తాడు. తన భార్య సనా బేగం పై హకీం షా కాలనీ విరాట్ నగర్ ప్రాంతానికి చెందిన మొహమ్మద్ అద్నాన్ తప్పుడు ఆరోపణలు చేసి సమాజంలో ఆమెను నిందించడానికి ప్రయత్నిస్తున్నాడని, దీంతో బిలాల్ బావమరిది మహమ్మద్ నవీద్ తో కలిసి చంపడానికి ప్రణాళిక వేశాడు. ఈ క్రమంలో కత్తి ని కూడా కనుగోలు చేశారు. ఆదివారం రాత్రి వీరిద్దరితో పాటు బిలాల్ భార్య సనా బేగం, రోహి బేగం లో కలిసి వెళ్లి అక్కడ కుటుంబ సభ్యులతో వాగ్వాదానికి దిగారు. ఆ సమయంలో అద్నాన్ లేకపోవడంతో అక్కడినుండి వెళ్ళిపోయారు. ఈ క్రమంలో అద్నాన్ సోదరుడు మహమ్మద్ ఇర్ఫాన్ రక్షించడానికి పారమౌంట్ కాలనీకి చేరుకున్నాడు. ఈ క్రమంలో ఇరువురు మధ్య వాగ్వివాదం జరిగింది. మధ్యలో ఇర్ఫాన్ వెళ్ళగా బిలాల్ కత్తితో చాతిలో పొడిచాడు. ఈ క్రమంలో స్థానికులు గాయపడిన ఇర్ఫాన్ ను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించి ఇర్ఫాన్ ను హత్య చేసిన బిలాల్ తో పాటు భార్య సనా బేగం రూహివేగం లను పోలీసులు అరెస్టు చేసి కత్తిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ముగ్గురిని రిమాండ్కు తరలించగా నవీద్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.






