- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉత్తమ పౌరులుగా ఎదిగేందుకు నిరంతర జ్ఞానసంపద పెంచుకోవాలి
అబిడ్స్ లోని స్టాన్లీ బాలికల ఉన్నత పాఠశాలలో ప్రపంచ ఆలోచనా దినోత్సవంను పురస్కరించుకుని నిర్వహించిన కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

దిశ, హైదరాబాద్ బ్యూరో : ఉత్తమ పౌరులుగా ఎదిగేందుకు విద్యార్ధులు నిరంతర జ్ఞాన సంపద పెంచుకోవాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి అన్నారు. అబిడ్స్ లోని స్టాన్లీ బాలికల ఉన్నత పాఠశాలలో ప్రపంచ ఆలోచనా దినోత్సవం (వరల్డ్ థింకింగ్ డే) ను పురస్కరించుకుని శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 22న స్కౌట్ ఉద్యమం స్థాపకుడు లార్డ్ రాబర్ట్ స్టీఫెన్సన్ స్మిత్ బాడెన్ పోవెల్ జయంతి రోజును ప్రపంచ ఆలోచన దినోత్సవంగా జరుపుకుంటారని కలెక్టర్ వివరించారు. మానవ జీవన శైలిలో ఆలోచన అత్యవసరమైన నైపుణ్యమని, చదువుతో పాటు, శారీరక, మానసిక, సామాజిక సర్వతోముఖాభివృద్ధి ఎంతో ముఖ్యమని అన్నారు.
విద్యార్థులే మన దేశ భవిష్యత్తని, వారు ఉత్తమ పౌరులుగా ఎదిగేందుకు నిరంతర జ్ఞాన సంపద, విశ్లేషణ, ప్రశ్నించే తత్వం ముఖ్యమని అన్నారు. క్రమశిక్షణ, నాయకత్వం, ఐక్యత, సమాజ సేవ వంటి విలువలను పెంచేదిశగా స్కౌట్స్ అండ్ గైడ్స్ సంస్థ చేస్తున్న కృషిని అభినందించారు. విద్యార్ధులు ప్రశ్నలు అడగడం ద్వారా బాల్యం నుండే ఆలోచించే అలవాటును పెంపొందించుకోవడంతో నిజజీవిత సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధం చేస్తుందని అన్నారు. అనంతరం వివిధ పోటీల్లో పాల్గొన్న విజేతలకు మెమెంటోలు అందించి ప్రశంసించారు. అంతకు ముందు విద్యార్థులు మార్చ్ ఫాస్ట్ నిర్వహించడంతో పాటు వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆర్గనైజర్, స్కౌట్ మాస్టర్ రాములు నాయక్, వివిధ పాఠశాలల స్కౌట్ మాస్టర్లు, స్కౌట్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.






