పాక్‌ను మరోసారి ఓడించిన‌ భారత్

by velandi.Saikiran |

FIH ట్రో లీగ్ లో భాగంగా భారత్ మరో విజయాన్ని నమోదు చేసుకుంది.

పాక్‌ను మరోసారి ఓడించిన‌ భారత్
X

దిశ‌, వెబ్ డెస్క్: FIH ట్రో లీగ్ లో భాగంగా భారత్ మరో విజయాన్ని నమోదు చేసుకుంది. పాకిస్తాన్ పై వరుసగా రెండోసారి విజయం సాధించింది ఇండియా. లండన్ వేదికగా జరిగిన మ్యాచ్ లో 7-1 తేడాతో పాకిస్తాన్ జట్టును మట్టి కరిపించింది. ఆరంభంలోనే గోల్ చేసిన పాకిస్తాన్, ఆ తర్వాత భారత ప్లేయర్ల దూకుడుతో చతికిల పడింది.

హర్మన్ ప్రీత్, సుఖ్ జీత్, అభిషేక్, రాజ్ కుమార్, దిల్ ప్రీత్, జాగ్రాజ్ ఇలా మొత్తం ఏడుగురు ప్లేయర్లు గోల్స్ చేశారు. దీంతో అవలీలగా పాకిస్తాన్ పై ఇండియా గెలిచింది. ఇక ఈ టోర్నమెంటులో ఇప్పటి వరకు 15 మ్యాచులు ఆడింది పాకిస్తాన్. ఇందులో ఒక్కటి కూడా పాకిస్తాన్ గెలవకపోవడం గమనార్హం. పాకిస్తాన్ చేతిలో ఇండియా 10 ఏళ్లలో ఒక్కసారి కూడా ఓడిపోలేదు. పాకిస్తాన్ పై పూర్తిగా భారత జట్టు డామినేట్ కనిపిస్తోంది.

Next Story