నగరంలో కొనసాగుతోన్న తిరంగా ర్యాలీ.. ఆ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు

by Kema Shiva Kumar |

‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor)‌ విజయవంతమైన నేపథ్యంలో ఇండియన్ ఆర్మీ (Indian Army)కి మద్దతుగా దేశ వ్యాప్తంగా తిరంగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు.

నగరంలో కొనసాగుతోన్న తిరంగా ర్యాలీ.. ఆ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు
X

దిశ, వెబ్‌డెస్క్: ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor)‌ విజయవంతమైన నేపథ్యంలో ఇండియన్ ఆర్మీ (Indian Army)కి మద్దతుగా దేశ వ్యాప్తంగా తిరంగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ హైదరాబాద్‌‌ (Hyderabad)లో బీజేపీ (BJP) ఆధ్వర్యంలో ట్యాంక్‌బండ్‌పై నిర్వహిస్తున్న తిరంగా ర్యాలీ సాయంత్రం 5.30కి అంబేద్కర్ విగ్రహం నుంచి ప్రారంభమై సైనిక ట్యాంక్ వరకు నెమ్మదిగా కొనసాగుతోంది. తిరంగా ర్యాలీ సందర్భంగా ట్యాంక్‌బండ్ (Tankbund) పరిసరాల్లో రాత్రి 7.30 వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్​డేవిస్ తెలిపారు.

సెల్లింగ్ క్లబ్, డీబీఆర్ మిల్స్, ట్యాంక్ బండ్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. అక్కడి నుంచి వెళ్లే వాహనాలను మళ్లి్స్తుండటంతో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని అధికారులు సూచించారు. సెక్రటేరియేట్ (Secretariat) జంక్షన్‌‌‌‌ నుంచి అప్పర్​ట్యాంక్ బండ్‌‌‌‌ వైపు వెళ్లే వాహనాలను లిబర్టీ వైపు మళ్లించనున్నారు. లిబర్టీ నుంచి అప్పర్​ట్యాంక్​బండ్​కు వెళ్లే వాహనాలను తెలుగు తల్లి ఫ్లైఓవర్ వైపు మళ్లిస్తారు. కర్బల మైదాన్ నుంచి అప్పర్​ట్యాంక్ బండ్‌‌‌‌ వైపు వచ్చే వాహనాలను కవాడిగూడ వైపు, డీబీఆర్ మిల్స్ నుంచి అప్పర్ ట్యాంక్ బండ్ వచ్చే వాహనాలను కవాడిగూడ గోశాల వైపు డైవర్ట్ చేయనున్నారు.

Next Story