- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
kidnap : మూడు సంవత్సరాల బాలిక కిడ్నాప్ ?
మూడు సంవత్సరాల బాలికను కిడ్నాప్ కు పాల్పడిన యువకుడిని బండ్లగూడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

దిశ, చార్మినార్ : మూడు సంవత్సరాల బాలికను కిడ్నాప్ కు పాల్పడిన యువకుడిని బండ్లగూడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బండ్లగూడ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అల్ జుబేల్ కాలనీలో ఈ నెల 27 వ తేదీన సాయంత్రం మూడు సంవత్సరాల మైనర్ బాలిక ఇంటి బయట ఒంటరిగా ఆడుకుంటుంది. అదే గ్రామానికి చెందిన సోహైల్ (25) సదరు బాలికను చంకన ఎత్తుకొని చాంద్రాయణగుట్ట చౌరస్తాలోని మహంకాళి ఆలయం రూట్ లో తీసుకెళ్తుండగా బాలిక కుటుంబ సభ్యులు పట్టుకొని బండ్లగూడ పోలీసులకు అప్పగించారు.
బాలిక కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బండ్లగూడ పోలీసులు సోహైల్ పై కిడ్నాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా సోహైల్ మాత్రం తాను కిడ్నాపర్ ను కాదని, బాలిక తప్పి పోయిందని వారి తల్లి దండ్రులకు అప్పగించడానికి ప్రయత్నిస్తున్నట్లు పోలీసుల విచారణలో చెప్పడం గమనార్హం. దీంతో పోలీసులు సోమవారం ఉదయం సీసీ కెమెరాలను పరిశీలించనున్నారు. ఇది కిడ్నాపా ? కాదా ? లైంగిక దాడి కోసం తీసుకెళ్తున్నాడా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.






