- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
త్రీ స్టేట్స్.. 21 టీమ్స్.. ఏకకాలంలో ఈగిల్ స్పెషల్ అపరేషన్
ఇండియాలో నైజీరియా డ్రగ్స్ మాఫియా తో లింక్ ఉన్న హవాలా రాకెట్ పై ఈగిల్ పంజా విసిరింది.

త్రీ స్టేట్స్.. 21 టీమ్స్.. ఏకకాలంలో ఈగిల్ స్పెషల్ అపరేషన్
- డ్రగ్స్ మాఫియాతో లింక్ ఉన్న హవాలా రాకెట్ గుట్టు రట్టు...
- ముంబాయి, గోవా, రాజస్థాన్ హవాలా రాకెట్ ముఠాల్లో కలవరం..
- 15 మంది అరెస్టు.. 2.70 కోట్లు స్వాధీనం
దిశ, సిటీక్రైం : ఇండియాలో నైజీరియా డ్రగ్స్ మాఫియా తో లింక్ ఉన్న హవాలా రాకెట్ పై ఈగిల్ పంజా విసిరింది. ఏకకాలంలో గోవా, రాజస్థాన్ , ముంబాయిలో 21 ప్రత్యేక టీం లు సోదాలు జరిపి 15 మందికి పైగా హవాలా అపరేటర్లను అరెస్టు చేశారు. ఈగిల్ చేసిన ఈ స్పెషల్ అపరేషన్ తో దేశవ్యాప్తంగా హవాలా నెట్ వర్క్ లో కలకలం రేపింది. ఈ హవాలా రాకెట్ ఏజెంట్ ల నుంచి దాదాపు 2.70 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. 30 రోజుల పాటు శ్రమించిన ఈగిల్ డ్రగ్స్ దందాతో సంపాదించిన డబ్బు ఎక్కడికి ఎలా వెళ్తుందనే రూట్ పై అన్ని కోణాల్లో విశ్లేషించుకుని డ్రగ్స్ దందా చేస్తున్న నైజీరియా దేశానికి చెందిన కొంత మంది స్మగ్లర్లతో మిలాఖత్ అయిన ఈ హవాల ఏజెంట్లను ఫాలో అయ్యి సోమవారం ఏకకాలంలో మూడు రాష్ట్రాల్లో సోదాలు జరిపి ఆ నెట్ వర్క్ ను ధ్వంసం చేశారు. దేశంలో ఇప్పటి వరకు చాలా రాష్ట్రాల పోలీసులు, కేంద్రానికి సంబంధించిన నార్కోటిక్ ఏజెన్సీలు అందరూ డ్రగ్స్ దందా చేస్తున్న వారిని అరెస్టు చేయడంతో భారీగా డ్రగ్స్ ను స్వాధీనం చేసుకుంటున్న విషయం తెలిసిందే. మొదటి సారిగా ఈగిల్ డ్రగ్స్ దందా సంపాదించిన డబ్బు ఎక్కడికి వెళ్తుందనే యాంగిల్ లో దర్యాప్తు చేసి డ్రగ్స్ మాఫియాతో హవాలా ఏజెంట్ లింక్ ను బయటపెట్టింది.
గోవాలో దొరికిన లీడ్ తో....
కొన్ని రోజుల కిందట ఈగిల్ అధికారులు గోవాలో స్పెషల్ అపరేషన్ ను నిర్వహించి హైదరాబాద్, గోవా, బెంగళూరులో డ్రగ్స్ దందా చేస్తున్న నైజీరియా దేశానికి చెందిన మాక్స్ వెల్ ను అరెస్టు చేశారు. ఆ సందర్భంలో మాక్స్ వెల్ ను విచారించినప్పుడు డ్రగ్స్ దందాతో అతను సంపాదిస్తున్న డబ్బును ఎక్కడ దాచిపెడుతున్నాడు, ఎవరికి ఇస్తున్నాడనే కోణంలో ఆరా తీశారు. దీంతో ఈగిల్ టీంకు గోవాలో హవాలా అపరేటర్ సమాచారం లభించింది. అలా ఆరా తీస్తే గోవా, రాజస్థాన్ , ముంబాయికి చెందిన హవాలా ఏజెంట్లు దేశంలో డ్రగ్స్ దందా చేస్తున్న నైజీరియా డ్రగ్స్ ముఠా సభ్యులు వారు వీరి ద్వారా హవాలా మార్గంలో డబ్బులను నైజీరియాలో ఉన్న సన్ని పాస్కల్ కు పంపిస్తున్నట్లు తేలింది. దీంతో దాదాపు 15 మంది హవాలా ఏజెంట్లను ఈగిల్ అధికారులు అరెస్టు చేశారు.
ఉత్తమ్ సింగ్ ఇంట్లో మసకబారిన రూ.10, రూ.20 నోట్లు
ఈగిల్ టీం లు గోవాలో మాక్స్ వెల్ ను అరెస్టు చేసిన తర్వాత హవాలా ఏజెంట్ ఉత్తమ్ సింగ్ గురించి తెలిసి అతని ఇంటికి వెళ్ళారు. అక్కడ వాషింగ్ మెషీన్ లో రూ.50 లక్షలు దాచిపెట్టిన నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆ సందర్భంలో మొత్తం ఇంటిని జల్లెడ పట్టగా కొన్ని చోట్ల కుప్పలు, కుప్పలుగా మసకబారిన రూ.10, 20 నోట్లు కనిపించాయి. అనుమానం వచ్చి ఆరా తీయగా ఉత్తమ్ సింగ్ హవాలా దందా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాడని తెలిసింది. అతనిని అరెస్టు తర్వాత జరిగిన విచారణలో తాజాగా అరెస్టైన 15 మంది హవాలా ఏజెంట్ల గుట్టు రట్టైంది. నైజీరియాకు చెందిన డ్రగ్స్ స్మగ్లర్లు మాదకద్రవ్యాల విక్రయాలతో వచ్చిన డబ్బును ఈ హవాలా ఏజెంట్లకు ఇస్తారు. ఈ ఏజెంట్లు ఆ పాత హవాలా నోట్ ఫొటోను తీసి వారికి ఇస్తారు. అదే ఫొటోను హవాలా ఏజెంట్లు నైజీరియాలో ఉన్న సన్ని పాస్కల్ కు పంపిస్తారు. నైజీరియాలో ఉండే డ్రగ్స్ స్మగ్లర్ల కుటుంబాలకు చెందిన వారు వారికి పంపిన నోట్ ను పాస్కల్ కు వెళ్ళి చూపిస్తే , అతనికి వచ్చిన నోట్ ను పరిశీలించుకుని వారికి అక్కడ నైజీరియా కరెన్సీలో డబ్బులను చెల్లిస్తున్న వైనాన్ని ఈగిల్ బయటపెట్టింది. ఈ హవాలా ఏజెంట్ల ద్వారా నైజీరియాకు చెందిన డ్రగ్స్ స్మగ్లర్లు ఎన్ని కోట్ల రూపాయల దందా చేశారనే విషయాలను ఈగిల్ టీం ఆరా తీస్తోంది.






